నిర్మాతలకు తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్లు అల్టిమేటం జారీ చేశారు. ఇకపై పర్సంటేజీ చెల్లించకపోతే సింగిల్ స్క్రీన్ థియేటర్ల మూసివేత తప్పదని హెచ్చరించారు. థియేటర్లలో ఆక్యుపెన్సీ లేకపోవడంతో సినిమా ప్రదర్శనలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై మీడియా సమావేశం నిర్వహించిన ఎగ్జిబిటర్లు వార్నింగులు లాంటి డిమాండులు నిర్మాతల ముందు ఉంచారు.
ఎగ్జిబిటర్లుకు పర్సంటేజీ ఇవ్వాలనేది మొదటి డిమాండ్. ఇకపై అద్దె ప్రాతిపాదికన సినిమాలు ప్రదర్శించేది లేదని తేల్చి చెప్పారు. మల్టీఫ్లెక్స్ తరహాలో పర్సంటేజీ చెల్లిస్తేనే షోలు. జులై 1 వరకు తెలుగు సినీ నిర్మాతలకు గడువు ఇచ్చిన ఎగ్జిబిటర్లు .. కల్కి 2898 ఏడీ, పుష్ప 2, గేమ్ ఛేంజర్, భారతీయుడు 2 చిత్రాలకు కు మాత్రం ఇందులో మినహాయింపు ఇచ్చారు. ఇతర సినిమాలను పర్సంటేజీ విధానంలోనే ప్రదర్శిస్తామని తీర్మానించారు.
ఇదే సందర్భంలో ఓ ఆరోపణ కూడా చేశారు. కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు సినిమా వ్యాపారాన్ని గాంబ్లింగ్ గా మార్చారని, బెనిఫిట్ షోలు, అదనపు ఆటలతో మోసాలకు పాల్పడుతున్నారని, అందుకే ఇకనుంచి బెనిఫిట్ షోలు, అదనపు ఆటలు ప్రదర్శించమని తేల్చేశారు. మరి ఎగ్జిబిటర్లు డిమాండ్లపై నిర్మాతలు స్పందన ఎలా వుంటుందో చూడాలి.