ఎన్నికల సంఘానికి ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్స్ లో ప్రశ్నలు సంధించారు. మామూలుగా అయితే ఇలాంటి సమయంలో ఆయన మీడియా ముందుకు వచ్చి కుట్ర సిద్దాంతాలు వల్లించాలి. కానీ ఆయన రావడం లేదు ఏమిటా అనుకుంటున్నారు.. ఆయన ఈ దేశంలో లేరని తేలిపోయింది. చిల్ అవడానికి విదేశాలకు వెళ్లారా లేకపోతే పనులు చక్కబెట్టడానికా అన్నది వారికే తెలియాలి. కానీ.. ఈసీపై ఆయనకు మండింది. అందుకే ఎక్స్ లో కొన్ని ప్రశ్నలతో ఓ పోస్టు పెట్టారు.
సజ్జల మొదటి ప్రశ్న ఏమిటంటే.. వీడియో ఎలా బయటకు వచ్చిందని. ఇప్పుడు వీడియో బయటకు రావడం తప్పన్నట్లుగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. తాము ఏం చేసినా ఏమీ బయటకు రాకూడదన్నట్లుగా సజ్జల ప్రశ్నలు వచ్చాయి. అది బయటకు వచ్చింది కాబట్టి మండదా అన్నట్లుగా ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో ఇత చోట్ల కూడా ఈవీఎంలను ధ్వంసం చేశారని వాటిని కూడా బయట పెట్టాలని డిమాండ్ చేశారు. పోలింగ్ బూత బ యట జరిగిన ఘర్షణలకు సంబధించి కొన్ని వీడియోలు రిలీజ్ చేసి వాటిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సజ్లల రామకృష్ణారెడ్డి డిమాండ్లు చూస్తే తాము అనుకున్నట్లుగా జరగట్లేదన్న మంట ఎక్కువగా ఉందన్న అభిప్రాయం సహజంగానే వస్తుంది. మాచర్లలో ఎలాంి పోలింగ్ జరుగుతుందో అందరికీ తెలుసు. దానికి స్థానిక ఎన్నికలే సాక్ష్యం. అయినా అక్కడేదో పీస్ ఫుల్ గా ఎన్నికలు జరుగుతూంటే.. ఈసీ చెడగొట్టిందన్నట్లుగా మాట్లాడుతున్నారు. పిన్నెల్లిని తప్పించి వైసీపీ ఘోర తప్పిదానికి పాల్పడిందని.. వైసీపీపై నిందలు వేస్తూ.. తమ పరాజయాన్ని పబ్లిక్ గా ఒప్పుకున్నట్లు గా వ్యవహరిస్తున్నారు.