2047 వరకు దేశం కోసం పని చేయాలని ఆ దేవుడు తనను ఆదేశించారని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఆయన ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారో కానీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
2047 వరకు దేశం కోసం తాను పని చేస్తూనే ఉంటానని…వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతానని మోడీ తెలిపారు. అంటే మోడీ మరో 23ఏళ్లు దేశాన్ని పాలించాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లుగా స్పష్టం అవుతోంది. ఆయన మాట వరసకు ఈ కామెంట్స్ చేశారా..? లేక మరో ఇరవై ఏళ్లు దేశాన్ని పాలించాలని మోడీ డెడ్ లైన్ పెట్టుకున్నారా..?అనే చర్చ విస్తృతంగా సాగుతోంది.
ప్రస్తుతం మోడీకి 75ఏళ్లు… 2047వచ్చేనాటికి 98ఏళ్లు నిండుతాయి. అప్పటివరకు దేశానికి సేవలందించేందుకు వయస్సు రీత్యా మోడీకి ఆరోగ్యం సహకరిస్తుందా..? అనేది అందరిలో కలిగే కామన్ డౌట్. అయితే, మోడీ వ్యూహత్మకంగా కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరో ఇరవై ఏళ్లపాటు కాంగ్రెస్ అధికారంలోకి రాదని చెప్పే ఉద్దేశంతోనే ఈ కామెంట్స్ చేసి ఉంటారని పరిశీలకులు భావిస్తున్నారు.