వరుణ్‌తేజ్ కెరీర్లో మర్చిపోలేని సినిమా ‘ఫిదా’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచిపోయింది. ఇప్పుడు వరుణ్‌తేజ్, శేఖర్ కమ్ముల మళ్లీ కలిసి పని చేయబోతున్నారు. ఏ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోందని టాక్. వరుణ్ ప్రస్తుతం ‘మట్కా’ చేస్తున్నాడు. శేఖర్ కమ్ముల ‘కుబేర’తో బిజీ. అవి రెండూ పూర్తయ్యాకే ఈ కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోందని తెలుస్తోంది. ‘ఫిదా’ తరవాత శేఖర్ కమ్ముల బాగా గ్యాప్ తీసుకొన్నారు. ఆ గ్యాప్‌లోనే కొన్ని కథలు తయారు చేశారు. అందులో ఓ కథ ‘కుబేర’. మరో కథ వరుణ్‌కి సెట్ అవుతుందన్న ఉద్దేశ్యంతో ఈ ప్రాజెక్ట్ ని వరుణ్ దగ్గరకు తీసుకెళ్లారు. వరుణ్ కూడా శేఖర్ కమ్ములతో పని చేయడానికి ఉత్సాహంగా ఉన్నాడు. ఈమధ్య వరుణ్ కెరీర్ గాడి తప్పింది. వరుసగా ఫ్లాప్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘మట్కా’పైనే ఆశలు పెట్టుకొన్నాడు. ‘మట్కా’ పూర్తిస్థాయి మాస్ సినిమా. శేఖర్ కమ్ముల కథ కూడా కొత్త జోనర్లో సాగబోతోందని తెలుస్తోంది. ఇందులో సాయి పల్లవి కూడా నటిస్తే ‘ఫిదా’ కాంబో పరిపూర్ణమైనట్టు.