వైసీపీకి ఓటమి సంకేతాలు కనిపిస్తుండటంతో ఆ నెపాన్ని ప్రజలపైనే నెట్టేందుకు సిద్దమైంది. ఇందుకోసం ఆల్రెడీ సోషల్ మీడియాను సన్నద్ధం కూడా చేసింది. ఓటమి ఖాయమని తేలడంతో సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు చేయాలి అనే అంశంపై సోషల్ మీడియా విభాగానికి ఆదేశాలు అందినట్లుగా తెలుస్తోంది.
ఈమేరకు అప్పుడే ఆ పార్టీ అనుబంధ వాట్సాప్ గ్రూప్ లలో ఓ ప్రచారాన్ని మొదలు పెట్టింది. వైసీపీకి తక్కువ సీట్లు వస్తే ఏపీ ప్రజలకు విశ్వాసం లేనట్లేనని చేసిన ఓ పోస్ట్ తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. వైసీపీని గెలిపిస్తేనే ఏపీ ప్రజలకు విశ్వాసం ఉన్నట్లనేది ఆ పార్టీ ఉద్దేశమని క్లియర్ గా అర్థం అవుతోంది. ఈ లెక్కన ప్రజా తీర్పు ప్రతికూలంగా వస్తే స్వాగతించేందుకు వైసీపీ సిద్దంగా లేదని స్పష్టం అవుతోంది.
రాజకీయాల్లో గెలుపోటములు సహజం.ప్రతిసారి గెలుపును కోరుకోవడంలో తప్పు లేదు, కానీ గెలిస్తే ప్రజా విజయమని, ఓడితే మాత్రం అదే ప్రజలకు విశ్వాసం లేదని వ్యాఖ్యానించడం రాజకీయ పార్టీగా వైసీపీకి ఏమాత్రం శోభనివ్వదు. ఐదేళ్ళు అధికారం అప్పగించినప్పుడు ప్రజా ఆకాంక్షలకు విరుద్దంగా పని చేయడంతోనే రానున్న ఫలితాలు ప్రతికూలంగా వస్తున్నాయని గ్రహించకుండా ప్రజలకు విశ్వాసం లేదని పేర్కొనడం తీవ్ర దుమారం రేపుతోంది.