ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఐపీఎల్ లో ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఫైనల్ లో తలపడనున్నాయి. కేకేఆర్ మూడోసారి టైటిల్ కైవసం చేసుకోవాలని చూస్తుండగా… రెండోసారి టైటిల్ ను ఎగరేసుకుపోవాలని సన్‌రైజర్స్ హైదరాబాద్ పట్టుదలతో కనిపిస్తోంది. అయితే, ఈ మ్యాచ్ కు వరణుడు ఆటంకం కలిగించే అవకాశం ఉంది.
రెమాల్ తుఫాన్ ప్రభావంతో చెన్నైలో వాతావరణ పరిస్థితులు మారనున్నాయని, ఆకాశం మేఘావృత్తమై వర్షం పడే అవకాశం ఉందని తాజాగా వాతావరణ శాఖ తెలిపింది. ఒకవేళ ఫైనల్ మ్యాచ్ కు వరణుడు ఆటంకం కలిగిస్తే అదనంగా 120గంటల సమయం ఉంటుంది. అయినప్పటికీ వర్షం తగ్గకపోతే రిజర్వ్ డే రోజున మ్యాచ్ ను నిర్వహిస్తారు. అయినా వర్షం కంటిన్యూగా పడితే పాయింట్ల పట్టిక ఆధారంగా విజేతను ఖరారు చేస్తారు.
అదే జరిగితే ఈ సీజన్ లో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచిన కోల్‌కతాను విజేతగా నిర్ణయిస్తారు. దీంతో ఫైనల్ మ్యాచ్ కు వరణుడు ఆటంకం కల్గించకూడదని ఐపీఎల్ అభిమానులు కోరుకుంటున్నారు.