నిన్నామొన్నటిదాకా క్యాష్ తప్ప మరో డిజటల్ పేమెంట్ తీసుకోలేదు ఏపీ మద్యం దుకాణాల్లో. ఇప్పుడు పాలసీ ఒక్క సారిగా మారిపోయింది. శుక్రవారం నుంచి ప్రభుత్వం పాలసీ మార్చేసింది. డిజిటల్ పేమెంట్ చేస్తేనే మద్యం ఇస్తామని వైన్‌షాప్ ఉద్యోగులు చెబుతున్నారు. డబ్బులు ఇస్తామంటే మద్యం అమ్మడం లేదు. హఠాత్తుగా వచ్చిన ఈ మార్పు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
నిరుపేద మందు బాబులకు తమ సంపాదన అంతా మద్యానికి పెడతారు కానీ.. స్మార్ట్ ఫోన్ వాడేంత సీన్ ఉండదు. వారికి కూడా డబ్బులు తీసుకుని మద్యం ఇవవడం లేదు. సాయంకాలం పని పూర్తి చేసుకుని, శరీర కష్టం నుంచి ఉపశమనానికి మద్యం తాగే అలవాటున్న వారంతా, క్వార్టర్ మందు కోసం క్యూలైన్లో నిలబడితే, లేనిపోని నిబంధనలు పెట్టి మందు లేదనేసరికి వారంతా చిర్రెత్తిపోతున్నారు. దీనికి కారణం ఉన్నతస్థాయి నుచి వచ్చిన ఆదేశాలే.
ప్రభుత్వం మారే పరిస్థితులు కనిపిస్తూండటం.. మద్యం స్కాం అతి పెద్దదని.. కేవలం క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే నిర్వహించడం వెనుక అతి పెద్ద స్కాం ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు. ఎన్ని ఆరోపణలు చేసినా .. కోర్టుల్లో పిటిషన్లు వేసినా, కేంద్రానికి ఫిర్యాదు చేసినా .. డిజిటల్ పేమెంట్స్ పెట్టమని చెప్పి తప్పించుకున్నారు తప్ప.. అమలు చేయలేదు. అరకొరగా అమలు చేశారు. ఇప్పుడు హఠాత్తుగా మొత్తం డిజిటల్ పేమెంట్స్ మాత్రమేనని అంటున్నారు.