ఏపి రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టిన 2016-17 ఆర్ధిక సంవత్సరం.ల బడ్జెట్ లో రాష్ట్రంలో కొత్తగా ఐదు చిన్న విమానాశ్రయాల ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురం వద్ద ఒకటి, కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు, గుంటూర్ జిల్లాలో సాగర్, ప్రకాశం జిల్లాలో దొనకొండ, మరియు నెల్లూరు జిల్లాలో దగదర్తి వద్ద చిన్న విమానాశ్రయాలు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే వాటిలో కొన్ని చోట్ల భూసేకరణకు ప్రయత్నాలు మొదలయ్యాయి.
వైజాగ్ – చెన్నై మరియు కర్నూలు-బెంగళూరు మధ్య పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుకు ముమ్ముర ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.
వైజాగ్, విజయవాడ, తిరుపతిలో: కన్వేషన్ సెంటర్లు, తిరుపతిలో సైబర్ స్కూల్ ఆఫ్ ఎక్స్ లెన్స్, వైజాగ్, విజయవాడలలో స్పోర్ట్స్ కాంపెక్స్ ల నిర్మాణం, కాకినాడలో సాంస్కృతిక క్షేత్రం (కల్చరల్ కాంప్లెక్స్), ప్రకాశం జిల్లాలో పారిశ్రామిక జోన్ ఏర్పాటు, రాష్ట్రంలో ప్రతీ అసెంబ్లీ నియోజక వర్గంలో ఒక స్టేడియం నిర్మాణం చేయడానికి ప్రభుత్వం నిశ్చయించుకొందని మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు.
కృష్ణా జిల్లాలో మచిలీపట్నం, శ్రీకాకుళం జిల్లాలో భావనపాడు నౌకాశ్రయాలను పి.పి.పి. పద్దతిలో నిర్మిస్తామని తెలిపారు.