ఏపీలో విధులు నిర్వహిస్తున్న డిప్యూటేషన్ అధికారులు సొంత సంస్థలకు వెళ్లిపోవాలని ప్రయత్నిస్తున్నారు. వీరంతా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉన్నవారే. జగన్ రెడ్డి వచ్చాక.. తాము చేసే పనులు చేయడానికి పనికి వస్తాయని తెచ్చుకున్నారు. ఐదేళ్లుగా వాళ్లతో ఓ ఆట ఆడించారు. జగన్ రెడ్డి సర్కార్ ఏం చేయమంటే అది రూల్స్ తో పని లేకుండా చేశారు. తీరా ఇప్పుడు ఎందుకైనా మంచిదని తమ దోవ తాము చూసుకుంటామని అడుగుతున్నా.. సీఎస్ జవహర్ రెడ్డి అంగీకరించడం లేదు. మీరేం భయపడకండి.. మళ్లీ జగనే సీఎం అవుతారని కౌన్సెలింగ్ ఇస్తున్నారని అధికారవర్గాలు చెబుతున్నాయి.
ఏపీ మద్యం విషయంలో చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇది మొత్తం వాసుదేవరెడ్డి అనే అధికారి చేతుల మీదుగా సాగింది. ఆయన ఐఏఎస్, ఐపీఎస్ కాదు.. కేంద్రం నుంచి డిప్యూటేషన్ మీద తెచ్చారు. వేల కోట్ల స్కాం చేసిందే కాకుండా చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టడంలో ఈయననే వాడుకున్నారు. ఇప్పుడీ వాసుదేవరెడ్డి వణికిపోతున్నాడు. జాతకం తిరగబడితే ఎక్కడుంటానో తెలియడం లేదని ముందుగా తన మాతృశాఖకు పంపాలని కోరుతున్నారు. ఆయనను ఇటీవల ఈసీ బదిలీ చేసింది. ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు. అలాగే ఏపీ ఖజానాను గుప్పిట్లో పెట్టుకున్న సత్యనారాయణ సహా పది మంది వరకూ డిప్యూటేషన్ అధికారులు.. గుంభనంగా తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
అయితే ఎవర్నీ పంపడానికి సీఎస్ జవహర్ రెడ్డి ఆసక్తి చూపించడం లేదు. అందరూ వెళ్లిపోతే తాను మాత్రమే అన్నింటికీ సమాధానం చెప్పాల్సి వస్తుందని ఫీలవుతున్నారేమో కానీ అందరం కలిసి చేశాం కాబట్టి అందరం కలిసే ఎదుర్కొందాం అన్నట్లుగా అట్టి పెట్టుకుంటున్నారు. మళ్లీ వైసీపీ గెలుస్తుందని కంగారుపడవద్దని సలహా ఇస్తున్నారు. ఇలా కౌన్సెలింగ్ ఇచ్చి.. నమ్మకం కలిగించేందుకు ఐ అండ్ పీఆర్ కమిషనర్ రెడ్డి డిప్యూటేషన్ పొడిగించాలని లేఖ కూడా రాయించారు. మొత్తానికి జవహర్ రెడ్డి మంచి తెలివిగలవారేనని సెటైర్లు ఇతర అధికారవర్గాల్లో వినిపిస్తున్నాయి.