లారెన్స్ హీరోగా లోకేష్ కనగరాజ్ నిర్మాణంలో ఓ సినిమా రూపుదిద్దుకొంటోంది. దీనికి ‘బెంజ్’ అనే టైటిల్ ఖరారు చేశారు. లారెన్స్ పుట్టిన రోజున ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. బి.కన్నన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రంలో సూర్య అతిథి పాత్ర పోషించబోతున్నాడు. లోకేష్కనగరాజ్ తీసిన విక్రమ్’లో రోలెక్స్‌గా సూర్య ఇచ్చిన ఎంట్రీ అదిపోయింది. ‘రోలెక్స్’ పేరుతో లోకేష్ సూర్యతో ఓ సినిమా తీస్తానని ప్రకటించాడు. `విక్రమ్ 2′ తీస్తే అందులో రోలెక్స్ పాత్రే హైలెట్ కాబోతోంది. ఈ నేపథ్యంలో లోకేష్ కోసం `బెంజ్`లోనూ గెస్ట్ గా కనిపించడానికి సిద్ధమయ్యాడు. సూర్య రాకతో ‘బెంజ్’ మైలేజీ మరింత పెరగబోతోంది.
తెలుగులో లారెన్స్ మార్కెట్ పడిపోయింది కానీ, తమిళంలో మంచి ఆదరణే ఉంది. గతేడాది విడుదలైన ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’ తెలుగులో ఫ్లాప్ అయినా, తమిళంలో మంచి వసూళ్లు అందుకొంది. అందుకే లారెన్స్ తో సినిమాలు చేయడానికి నిర్మాతలు ముందుకు వస్తున్నారు. లోకేష్ కనగరాజ్‌కి దర్శకుడిగా మంచి మార్కెట్ ఏర్పడింది. ఆ బ్రాండ్ వాల్యూ `బెంజ్`కి తోడైంది. దాంతో పాటు సూర్య కూడా రంగంలోకి దిగాడు. ఇక ‘బెంజ్’ మరింత స్పీడందుకోవడం ఖాయం.