జనసేన విశాఖ కార్పొరేటర్ మూర్తి యాదవ్ చేసిన ఆరోపణలతో చీఫ్ సెక్రటరీ జవహర్ రడ్డి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఆయన ఆరోపణలకు ఉలిక్కి పడి వివరణ ఇచ్చారు. సీక్రెట్ గా తన విశాఖ పర్యటనల గురించి తప్పుడు సమాచారం ఇవ్వడమే కాదు.. చర్యలు తీసుకుంటానని మూర్తి యాదవ్ ను బెదిరించారు. అయితే ఇలాంటి వాటికి మూర్తి యాదవ్ బెదరలేదు. దమ్ముంటే సీబీఐ విచారణకు అంగీకరించాలని సవాల్ చేస్తున్నారు.
జవహర్ రెడ్డి, ఆయన కుమారుడు బోగాపురం వద్ద చేస్తున్న భూదందాల గురించి ఖచ్చితంగా చెబుతున్నారు మూర్తి యాదవ్. సీఎస్ సీక్రెట్ విశాఖ పర్యటనలు పూర్తి స్థాయిలో భూకబ్జాల కోసమేనని స్పష్టం చేస్తున్నారు. ఈ ఆరోపణలను టీడీపీ కూడా సమర్థిస్తోంది. విశాఖ, బోగాపురం దగ్గర భూదందాలు లెక్కలేనన్ని జరుగుతున్నాయి. ఎన్ని రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.. ఎన్ని అసైన్డ్ ల్యాండ్స్ చేతులు మారుతున్నాయో లెక్కలు బయటకు రావడం లేదు.
కానీ వైసీపీలోని అగ్రనేతలకు సంబంధించిన వారు మాత్రం గత రెండు, మూడు నెలలుగా ఇంత కాలం తాము కబ్జాలు చేసిన వాటిని అధికారికంగా రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తున్నారు. అక్కడి అధికారులు కలెక్టర్ సహా అందరూ సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జవహర్ రెడ్డిపై ఆరోపణలు రావడంతో విషయం బయటకు వచ్చింది.