వైసీపీలో ఎవరు ఎ వెధవ పని చేసినా కాపాడటానికి ఒక్క లాయర్ పరుగుల మీద వచ్చేస్తారు. అది గల్లీ కోర్టు అయినా.. హైకోర్టు అయినా.. సుప్రీంకోర్టు అయినా ఆయన పేరే వినిపిస్తుంది. ఆయనే నిరంజన్ రెడ్డి. తెలంగాణకు చెందిన ఈ లాయర్ కు.. బహుమతిగా ఎంపీ సీటు కూడా దక్కింది. సిట్టింగ్ ఎంపీ అయినప్పటికీ ఆయన వైసీపీ కోసం తప్పుడు పనులు చేసి దొరికిపోయిన ప్రతి ఒక్కర్ని కాపాడేందుకు .. కోర్టుల వెంట పరుగులు పెడుతూ ఉంటారు.
పిన్నెల్లికి మిగతా కేసుల్లో ముందస్తు బెయిల్ ఇప్పించేందుకు అఘమేఘాలపై పిటిషన్ వేసి.. ఆదివారం విచారణ జరిగేలా చూసుకున్నారు. వాదనలు వినిపించారు. ఈవీఎం ధ్వంసం కేసులో ముందస్తు బెయిల్ వచ్చేలా వాదనలు వినిపించింది ఈ రెడ్డిగారే. ఈయన ట్రాక్ రికార్డు చూస్తే.. సీబీఐ కోర్టుల్లో జగన్ కేసులు ముందుకు సాగకుండా ఆనకట్టలా అడ్డం పడుతోంది కూడా ఈయనే. ఎన్ని వందల పిటిషన్లు వేశారో లెక్కే లేదు. ట్రైల్ ప్రారంభం కాకుండా చేసి.. తన లాయర్ తెలివి తేటల్ని ప్రదర్శిస్తున్నారు. వైసీపీ కోసం హైకోర్టుకు వెళ్తారు.. సుప్రీంకోర్టులోనూ వాదిస్తారు. ముఖ్యంగా జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఈయనే ముందు ఉంటారు. అంత కంటే పెద్దలాయర్లు అవసరమైనప్పుడు ఆయనే ఎంగేజ్ చేస్తారు.
కొసమెరుపేమిటంటే… సుప్రీంకోర్టులో ఆయన కుమారుడు ఓ ఉద్యోగంలో ఉన్నారు. గతంలో జగన్ రెడ్డి కేసుల్లో హైకోర్టు ఇచ్చిన తీర్పును ఈడీ సవాల్ చేసింది. కేసుల్లో బెంచ్ హంటింగ్ పాల్పడ్డారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. మొత్తానికి వైసీపీ మార్క్ నిరంజన్ రెడ్డి అని… లాయర్ సర్కిల్స్ లో గట్టిగానే చెప్పుకుంటారు. కొసమెరుపేమిటంటే… చిరంజీవి హీరోగా ఓ సినిమా కూడా నిర్మాతగా తీశారు.