ట్యాపింగ్ లీకుల్ని మళ్లీ ప్రారంభించింది తెలంగాణ కాంగ్రెస్ సర్కార్. మొదట్లో ఎంతో ఆసక్తికరంగా ఉన్న ట్యాపింగ్ కేసు చిన్న డెవలప్మెంట్ కూడా లేకుండా రోజు రోజుకు లీకులతో వీకయిపోతూ వస్తోంది. రాధాకిషన్ రావు స్టేట్ మెంట్ అంటూ తాజాగా లీకులిచ్చి బీఎల్ సంతోష్‌ను అరెస్టు చేయాలనుకున్నారని.. కానీ కుదరలేదని చెప్పుకొచ్చారు. ఈ లీక్ గతంలోనే బయటకు వచ్చింది. ప్రత్యేక విమానాలద్వారా పోలీసు ఆఫీసర్లని బీఎల్ సంతోష్ అరెస్టు కోసం పంపారని కూడా చెప్పుకున్నారు. ఇప్పుడు మళ్లీ కొత్తగా ఇంకో కోణంలో అదే టాపిక్ ను లీక్ ద్వారా వెల్లడించారు.
దీని వల్ల ఎంత ఉపయోగం ఉందేమో కానీ.. పోన్ ట్యాపింగ్ ఇష్యూని రాజకీయంగా ఉపయోగించుకోవడంలో రేవంత్ వ్యూహం ఏ మాత్రం ఫలించడం లేదన్న అభిప్రాయం మాత్రం అంతకంతకూ బలపడుతోంది. ఇప్పటి వరకూ కొంత మంది అరెస్టులు తప్ప.. ట్యాపింగ్ ను నిరూపించే చిన్న ఆధారం అయినా దొరికిందని చెప్పలేపోయారు. ధ్వంసం చేశారనే కబుర్లు ఏ మాత్రం వర్కవుట్ కావు. సాక్ష్యాలు చూపించాల్సిందే. ట్యాపింగ్ చే్యడానికి చిన్న చిన్న పరికరాలు సరిపోవు. విదేశాల నుంచి తెప్పించాలి.. అవి ఎక్కడి నుంచి వచ్చాయో తేల్చాలి.. అలాంటి పనులు మాత్రం చేయడం లేదు.
ఎన్నికల కోడ్ కూడా ముగింపు స్టేజ్ కు వచ్చింది. అసలైన నిందితుడిగా చెబుతున్న వ్యక్తి అమెరికాలో ఉన్నారు. వస్తారో రారో తెలియదు. రెడ్ కార్నర్ నోటీసులు.. బ్లూ కార్నర్ నోటీసుల పేరుతో హడావుడి చే్సతున్నారు. ఈ లోపు కేటీఆర్, కేసీఆర్ పేర్లను తెరపైకి తెచ్చారు. వారు ఏం చేసుకుంటారో చేసుకోమని సవాల్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో.. తమ వద్ద ఆధారాలతో క్విక్ యాక్షన్ ప్రారంభించాలి కానీ ఇప్పటికీ లీకుల హడావుడే చేస్తే.. నినిమాలో కథ లేదని జనాలు ఫీలయ్యే ప్రమాదం ఉంటుంది.