వైసీపీ సోషల్ మీడియా అబద్దాల ఫ్యాక్టరీ అని మరోసారి ప్రూవ్ అయింది. ఓటమి అంచున ఉన్నప్పటికీ కూడా అవే అబద్దాలను విస్తృతంగా ప్రచారం చేస్తోంది. వైసీపీ విజయం ఖాయమని, జూన్ 9న విశాఖలో సీఎంగా జగన్ ప్రమాణస్వీకారాన్ని చూసేందుకు హోటల్స్ గదులన్నీ అప్పుడే బుక్ అయ్యాయంటూ ఓ రేంజ్ లో ఎలివేషన్ ఇస్తోంది. దీంతో వైసీపీ సోషల్ మీడియాపై అనుమానం వచ్చి పరిశీలిస్తే అదంతా ప్రచారమేనని తేలిపోయింది.
విశాఖలో జూన్ 9న హోటల్ గదుల పరిస్థితి ఏంటని ఆరా తీస్తే వందల సంఖ్యలో రూమ్ లు ఇంకా అందుబాటులోనే ఉన్నాయని తేలింది. సరిగా బుకింగ్స్ లేని కారణంగా పలు హోటళ్లు ఆకర్షణీయమైన ఆఫర్లు కూడా ప్రకటించడం విశేషం. గో ఐబిబో, మేక్ మై ట్రిప్ వంటి ఆన్ లైన్ యాప్ లను పరిశీలిస్తే వైజాగ్ లో భారీ డిస్కౌంట్ తో హోటల్స్ స్వాగతం పలుకుతున్నాయి.దీంతో వైసీపీ ప్రచారం అంతా ఉత్తదేనని స్పష్టమైంది.
అలాగే, విశాఖకు వెళ్ళే బస్సుల్లో బెర్త్ లు కూడా అప్పుడే బుక్ అయ్యయాని వైసీపీ ఉదరగొడుతోంది. కానీ, వివిధ ప్రాంతాల నుంచి విశాఖకు వెళ్ళే బస్సులో సీట్లు ఇంకా ఖాళీగానే ఉన్నట్లు తెలిసింది. వీటిలో కూడా 10, 20శాతం డిస్కౌంట్ లు కూడా ఉండటం గమనార్హం. కానీ వైసీపీ మాత్రం విశాఖ జూన్ తొమ్మిదిన ఫుల్ కానుందని…జనంతో కిక్కిరిసిపోనుందని ప్రచారం చేస్తూ ఎలివేషన్లు ఇచ్చుకుంటూ స్వయం సంతృప్తి పొందుతోంది.