హైదరాబాద్ బేగంపేటలోని ప్రజా భవన్ కు బాంబు బెదిరింపు కలకలం రేపింది. ప్రజా భవన్ లో బాంబును పెట్టామని కాసేపట్లో అది పేలుతుందని గుర్తు తెలియని ఓ వ్యక్తి పోలీసు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి బెదిరించాడు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ప్రజా భవన్ లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
బాంబు బెదిరింపుతో ప్రజా భవన్ లో ఉన్న వారందరిని బయటకు పంపించారు అధికారులు. బాంబు స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టిన పోలీసులు ప్రజా భవన్ లో బాంబు లేదని నిర్ధారించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. బెదిరింపుల కోసమే ఇలా చేసినట్లు గుర్తించి ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ బెదిరింపులకు పాల్పడిన ఆకతాయిని గుర్తించే పనిలో పడ్డారు.
పోలీసు కంట్రోల్ కు రూమ్ కు ఫోన్ చేసి వ్యక్తి ఎవరు…? ఎక్కడి నుంచి ఫోన్ చేశాడు..? ఎందుకు బెదిరింపులకు పాల్పడ్డాడు..? తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏమైనా ప్లాన్ చేశారా.? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టనున్నారు.