ఉద్యోగం కోసం వెతుకుతున్నారా…? ఫ్రెషర్స్ ఎలాంటి స్కిల్ సెట్ ఉంటే జాబ్ వస్తుంది…? ఏయే రంగాల్లో ఎక్కువ హైరింగ్స్ జరుగుతున్నాయి…? ఇలాంటి విషయాలపై లింక్డిన్ కీలక విషయాలను వెల్లడించింది.
కార్పోరేట్ నుండి కామన్ జాబ్ వరకు జాబ్స్ కోసం చాలా మంది లింక్డిన్ లో సెర్చ్ చేస్తుంటారు. ఆ డేటా ఆధారంగా లింక్డిన్ పలు సూచనలు చేసింది. సిస్టమ్ ఇంజనీర్స్ అండ్ ప్రోగ్రామ్స్ అనలిస్ట్, కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసిన వారికి ఎక్కువ అవకాశాలున్నట్లు పేర్కొంది.
వీటితో పాటు లీగల్, మీడియా అండ్ కమ్యూనికేషన్స్ రంగాల్లో ఎక్కువ డిమాండ్ ఉందని… మంచి నైపుణ్యం సంపాదించుకోలిగితే మంచి ఆఫర్స్ వస్తాయని లింక్డిన్ తెలిపింది.
టెక్ ఆధారిత ఉద్యోగాల విషయంలో స్కిల్ అప్ గ్రేడ్ చేసుకోవటం అనేది అత్యంత ముఖ్యమని, ఏమాత్రం వెనుకబడ్డా భవిష్యత్ లోనూ ప్రమాదమేనని ఈ ప్రముఖ సోషల్ మీడియా యాప్ విశ్లేషించింది.