దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో టాలీవుడ్ నటి హేమకు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. జూన్ 1న విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. మొదట మే 27నే విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చినా తాను వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నానని విచారణకు డుమ్మా కొట్టిన హేమకు రెండోసారి నోటీసులు ఇవ్వడంతో విచారణకు వెళ్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే ఈ కేసు నుంచి హేమను బయటపడేందుకు ఏపీ లీడర్లు ప్రయత్నిస్తున్నారని కన్నడ మీడియా కోడై కూస్తోంది. రాజకీయ పరమైన ఒత్తిళ్ళు కూడా వస్తున్నాయని ఓ అధికారి కూడా చెప్పడంతో ఏపీకి చెందిన అధికార పార్టీ నేతలు రేవ్ పార్టీ కేసులో హేమను సేఫ్ చేయాలనుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే హేమకు పోలీసులు రెండోసారి విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇవ్వడం ఇంట్రెస్టింగ్ గా మారింది.
హేమ జూన్ 1న జరగబోయే విచారణకు వెళ్తుందా..పొలిటికల్ గా సపోర్ట్ లభ్యం అవుతుందని ప్రచారం జరుగుతుండటంతో మరోసారి విచారణకు డుమ్మా కొడుతుందా అనేది చర్చకు దారితీసింది. అయితే, రెండోసారి విచారణకు హేమ హాజరు కాకపోతే నేరుగా అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.