కోడ్ ఉండ‌గా ఏపీలో టీచ‌ర్ల బ‌దిలీలు… తెర వెనుక ఉంది ఆయ‌నేనా?

ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉండ‌గా ఎలాంటి నిర్ణ‌యాలు ఉండ‌వు. రూల్స్ ప్ర‌కారం… ఎన్నిక‌ల సంఘం ఆదేశాల మేర‌కు రోజు వారీ కార్య‌కాలాపాలు మాత్ర‌మే జ‌రుగుతుంటాయి. కొత్త ప్ర‌భుత్వాలు ఏర్పాడ్డాక లేదంటే కోడ్ ముగిశాక విధానప‌ర‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటారు. మ‌రీ అత్య‌వ‌స‌రం అయితే ఈసీ అనుమ‌తి కోరి, ఓకే అన్నాక నిర్ణ‌యాలు తీసుకోవాల్సి ఉంటుంది.

కానీ, ఏపీలో పాల‌న తీరే సెప‌రేటు క‌దా. ఈసీ అనుమ‌తి లేకుండా, ముందుగా నిర్ణ‌యించకున్నా, టీచ‌ర్ల బదిలీల‌కు రంగం సిద్ధం అయిపోవ‌టం ఉద్యోగ సంఘాల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. అసెంబ్లీ గ‌డువు ముగిసి ఎన్నిక‌లు జ‌రగ్గా, ఫ‌లితాలు మ‌రి కొన్ని రోజుల్లో రాబోతుండ‌గా కొత్త ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు విరుద్దంగా అధికారులే బ‌దిలీల‌కు రంగం సిద్ధం చేయ‌టం అనేక విమ‌ర్శ‌ల‌కు తావిస్తుంది. దీని వెనుక ఉన్న‌వారు ఎవ‌రు…? విద్యాశాఖ‌ను శాసించేది ఎవ‌రు…? అన్న ప్ర‌శ్న‌లు మొద‌ల‌య్యాయి.

ఈ బ‌దిలీల‌పై ఏపీ ఉద్యోగుల సంఘం తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. ఇది కొంత‌మంది కావాల‌ని చేస్తున్నార‌ని… కొత్త ప్ర‌భుత్వం వ‌చ్చే వ‌ర‌కు బ‌దిలీలు నిలిపివేయటంతో పాటు బ‌దిలీలు చేప‌ట్టిన అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తూ ఏపీ ఉద్యోగుల సంఘం నేత కేఆర్ సూర్యనారాయ‌ణ సీఈవోకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల మోడ‌ల్ కోడ్ ఆఫ్ కండెక్ట్ ను ధిక్క‌రించిన అధికారుల‌పై క‌ఠిన శిక్ష తీసుకోవ‌టంతో పాటు బ‌దిలీల ప్ర‌క్రియ నిలిపి వేసేలా ఆదేశించాల‌ని కోరారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మారుతికి ముందే తెలుసా?

రాజ్ తరుణ్ కి హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. రెండు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రాజ్ నుంచి వచ్చాయి. పురుషోత్తముడు, తిరగబడరాస్వామి, భలే ఉన్నాడే. ఈ మూడు ఫ్లాపులే. భలే ఉన్నాడే చాలా...

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

చిట్‌చాట్‌లతో BRSను చిరాకు పెడుతున్న రేవంత్ !

రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే మాటలు మీడియాలో హైలెట్ అవుతూంటాయి. వాటిని పట్టుకుని బీఆర్ఎస్ ఆవేశ పడుతోంది . అంతా అయిపోయిన తరవాత తీరిగ్గా.. నేను ఎప్పుడన్నాను అని రేవంత్...

ఢిల్లీ తర్వాత సీఎం కూడా కేజ్రీవాలే ?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు ఢిల్లీ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సీఎంగా కేజ్రీవాల్ ఎవరికి చాన్సిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. విచిత్రంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close