పి.ఎస్.ఎల్.వి.ప్రయోగం విజయవంతం అయ్యింది. నిజం చెప్పాలంటే పి.ఎస్.ఎల్.వి.ప్రయోగాలు విజయవంతం అవడం ఇప్పుడు సర్వసాధారణమయిపోయింది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుండి కొద్ది సేపటి క్రితం ప్రయోగించిన పి.ఎస్.ఎల్.వి.-సి32 ఉపగ్రహ వాహక రాకెట్ ఐ.ఆర్.ఎన్.ఎస్.ఎస్.-1 ఎఫ్ అనే 1425కేజీల బరువున్న ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. దేశంలోని నావిగేషన్ వ్యవస్థలను బలోపేతం చేసుకొనేందుకు మొత్తం ఏడు ఉపగ్రహాలను ప్రవేశపెట్టాలని 2013లో ఇస్రో ప్రణాళికలు సిద్దం చేసుకొని ఇంతవరకు ఆరు నావిగేషన్ ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ నెలాఖరున ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం సిరీస్ లోని చివరి ఉపగ్రహాన్ని కూడా ప్రవేశపెట్టబోతోంది.