లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలులు వీస్తున్నాయి. ప్రధాని మోడీ హ్యాట్రిక్ అని, 400సీట్లు పక్కా అంటూ బీజేపీ విజయంపై ధీమాగా ఉన్నా, తీరా ఫలితాలు వస్తున్న తీరు చూస్తుంటే బోటాబోటీగానే ఉన్నాయి.
ఇండియా కూటమి అనుకున్న దానికన్నా మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. బీజేపీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, సొంతగా ఏర్పాటు చేసే పరిస్థితులు అయితే కనపడటం లేదు. మిత్రపక్షాల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం దాదాపు ఖాయం అయిపోయింది.
అయితే, ఎన్డీయేలో ఉన్న పార్టీల్లో ఇప్పుడు టీడీపీ కీలకం. ఎందుకంటే ఏపీలో తిరిగి అధికారంలోకి రాబోతుండగా… భారీగా ఎంపీగా సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. దాదాపు అన్నీ సీట్లలో టీడీపీ గెలుపు దిశగా ఉంది. ఈ ట్రెండ్స్ ఇవే కంటిన్యూ అయితే, జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు మరోసారి చక్రం తిప్పటం దాదాపు ఖాయమే.
బీజేపీ ఆశలు పెట్టుకున్న యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీకి అనుకున్న సీట్లు రాకపోవటం ఎదురుదెబ్బగా మారింది.