రోజా… రాజకీయాల్లో ఐరెన్ లెగ్ ఎవరంటే, ఈ పేరుకు ప్రత్యామ్నాయం, పోటీ లేనే లేవు. `జగన్ గెలుస్తాడు` అనే మాట రోజా నుంచి వచ్చినప్పుడే `ఏపీ రాజకీయాల్లో వైసీపీ నామరూపాలు లేకుండా పోతుంది` అని ఫిక్సయిపోయారంతా. ఇప్పుడు అదే నిజమైంది. ఏపీ రాజకీయాల్లో కనీ వినీ ఎరుగని రీతిలో.. ఓ పార్టీ ఈరోజు భూస్థాపితం అయిపోయింది. ఇందులో టీడీపీ, జనసేన, బీజేపీ క్రెడిట్ ఎంత ఉందో, రోజా ఐరెన్ లెగ్ ఘనత కూడా అంతే ఉందని అంతా నమ్ముతున్నారు. స్వయానా రోజా కూడా నగరి నియోజక వర్గం నుంచి ఘోర పరాజయం పాలైంది. ఏపీ మంత్రులందరిలోనూ తొలుత ఓడిపోయే సీటు.. రోజాదే అని అందరూ ముక్త కంఠంతో చెప్పారు. అది అక్షరాలా నిజమైంది. నగరిలోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లోనూ రోజా అడ్రస్స్ గల్లంతయ్యింది. ఈ ఐదేళ్లలో రోజా చేసిన ఓవర్ యాక్షన్‌కు ఏపీ ప్రజలు, ముఖ్యంగా నగరి ఓటర్లు బదులు తీర్చుకొన్నారు. ఆమెను సగర్వంగా ఇంటికి సాగనంపారు.
ఇప్పుడు రోజా పరిస్థితి ఏమిటి? నగరి ఎం.ఎల్.ఏగా ఉండి కూడా జబర్దస్త్ లాంటి షోలు చేసి అప్రతిష్ట పాలైంది రోజా. ఆ తరవాత అదృష్టం కొద్దీ మంత్రి అయ్యింది. మంత్రిగా తాను చేసిందేం లేదు. మంత్రి అవ్వడం వల్ల జబర్దస్త్ కష్టంగా వదులుకోవాల్సివచ్చింది. ఇప్పుడు ఎం.ఎల్.ఏ సీటు కూడా పోయింది. ఇప్పుడు జబర్దస్త్‌కి రావడం తప్ప రోజా ముందున్న ఆప్షన్ లేదు. ఎందుకంటే సినిమాల్లో రోజాని ఎప్పుడో మర్చిపోయారు. రాజకీయాలు ఇప్పుడు గత చరిత్ర. ఇప్పుడు జబర్ దస్త్కి రావడం, కొన్ని కుళ్లు జోకులు వేసుకోవడం తప్ప రోజాకు పెద్ద పనేం ఉండదు. మొత్తానికి రోజా ఐరెన్ టంగ్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. వేణు స్వామి తరవాత.. అంతటి టంగ్ రోజాదే అని వైకాపా నేతలు బావురు మంటున్నారు. రోజా గత మాటలు, కామెంట్లు, స్టేట్మెంట్లు చూసి జనాలు నవ్వుకొంటున్నారు. అంతే తేడా.