పోటీ చేసిన అన్ని చోట్లా విజయం సాధించింది జనసేన పార్టీ. కూటమిలో భాగంగా 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ సీట్లలో పోటీ చేసింది. వంద శాతం కాకపోయినా పదిహేను సీట్లు గెలుస్తారని అందరూ అంచనా వేశారు. ఎందుకంటే.. తీసుకున్న సీట్లలో పాలకొండ, పోలవరం, రైల్వే కోడూరు వంటి కొన్ని క్లిష్టమైన సీట్లు ఉన్నాయి. అయినప్పటికీ ప్రజలు కూటమికి పట్టం కట్టారు. ఈ క్రమంలో అన్ని సీట్లలో జనసేన పార్టీ ఘన విజయం సాధించింది.
వైసీపీకి ఇప్పుడు 9 మంది ఎమ్మెల్యేలు ఉంటే.. జనసేనకు 21 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ప్రతిపక్ష హోదా కూడా వైసీపీకి దక్కలేదు. కావాలనుకుంటే పవన్ కల్యాణ్ ప్రతిపక్ష నేత హోదాలో ఉంటారు. పార్లమెంట్ ఎన్నికల విషయంలోనూ జనసేన పార్టీ రికార్డు సృష్టించింది. రెండు సీట్లలో పోటీ చేసి రెండు చోట్లా భారీ ఆధిక్యతతో విజయం సాధించింది. మచిలీపట్నం, కాకినాడల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.
గత ఎన్నికల్లో పోటీ చేసి రెండు చోట్ల ఓడిన పవన్ కల్యాణ్ ను వైసీపీ నేతలు ఎంతో ఘోరంగా అవమానించారు. ఇప్పుడు రివర్స్ అయింది. వైసీపీ నేతల కంటే పవన్ ఎంతో ఎత్తులో నిలిచారు. ఇప్పుడు వారంతా జనసేన పార్టీలో చేరేందుకు పరుగులు పెట్టుకుంటూ రావాల్సి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది.