ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా జగన్ రెడ్డి తన డ్రామాలను మానుకోలేదు. ఓటమిని హుందాగా అంగీకరించకుండా మీడియా ముందుకు వచ్చి ఎన్నికల ప్రచారసభల్లో చెప్పినట్లుగా చాలా మంచి చేశామని.. మేనిఫెస్టోను అమలు చేశామని చెప్పుకొచ్చారు. ఎంతో మంది ఆప్యాయత చూపారని.. వాళ్ల ఓట్లన్నీ ఏమైపోయాయోనని అమాయకత్వం నటించారు. ఈవీఎంలపై పరోక్షంగా అనుమానాలు వ్యక్తం చేసి.. కానీ ఆధారాల్లేవని చెప్పుకొచ్చారు.
2019లో చంద్రబాబునాయుడుపై అంత వ్యతిరేకత ఉందని ఎవరూ అనుకోలేదు. ఐదేళ్లలో సంక్షేమం, అభివృద్ది పరుగులు పెట్టాయి. అయినా అయినా ఆయనకు అత్యంత ఘోర పరాజయం ఇచ్చారు. అప్పుడు చంద్రబాబునాయుడు సాకులు చెప్పలేదు. హుందాగా స్పందించి వెళ్లిపోయారు. కానీ ఐదేళ్లలో లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజలకు పావాలా, అర్థ పంపిణీ చేసి.. అవి ఇచ్చినా ఓటు వేయలేదని ఏడుపుమొహం పెట్టడం హుందాతనం అనిపించుకోదు.
ఐదేళ్లలో చేసిన అరాచకాలు ప్రజల కళ్ల ముందు నుంచి పోతాయా.. ప్రతీ వ్యవస్థను చెడగొట్టారు. ప్రజలకు ప్రతీ దానికి భయపెట్టేలా చేశారు. నోరు తెరిస్తే వైసీపీ మూకలు ఎక్కడ మీద పడిపోతాయోనన్న ఆందోళనతో ప్రజలు బతికారు. అన్నింటికీ చెక్ పెట్టారు. మంచి జరిగితేనే ఓటేయండి అని అడిగారు.. జరగలేదని తీర్పిచ్చారు.. నేను మంచి చేశానని సర్టిఫికెట్ ఇచ్చుకుంటే సరిపోదు.. ప్రజలు ఓట్లేయాలి. అవి వేయలేదు కాబట్టి..హుందాగా సద్దుకుంటే బెటర్.