కూటమి గెలవడంతో జగన్ సర్వీస్ బ్యాచ్ అధికారులు పరారవుతున్నారు. వారందరికీ ఉన్న పళంగా సీఎస్ జవహర్ రెడ్డి సెలవులు మంజూరు చేస్తూ పంపిచేస్తున్నారు. ముఖ్యంగా సీఐడీ సంజయ్ ను అమెరికా పంపించేస్తున్నారు. ఫలితాల ట్రెండ్ తెలియగానే ఆయనకు సెలవు ఇస్తూ.. ఆదేశాలు ఇచ్చారు.తాను అమెరికా పోతానని ఆయన లెటర్ పెట్టుకున్నారు. వచ్చే నెల మూడు వరకూ సెలవు.
ఆయనతో పాటు పలువురు ఐపీఎస్ అధికారుల్లో కలవరం రేగుతోంది. ఏం చేయలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. డిప్యూటేషన్ పై ఏపీకి వచ్చిన అధికారులు చాలా మంది సొంత ఉద్యోగాలకు వెళ్లిపోవాలనుకున్నా సాధ్యం కావడం లేదు. తాము మళ్లీ గెలుస్తామని ఉండాలని పట్టుబట్టారు. వారంతా ఇప్పుడు ఇరుక్కుపోయారు. వారిని ఉన్న పళంగా పంపే అవకాశం లేదు. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టడం, జగన్ రెడ్డి అవినీతి సామ్రాజ్యంలో వీరంతా కీలకం. వీళ్లని వదిలి పెట్టే అవకాశం ఉంది.
కీలక పదవుల్లో ఉన్న కొందరు రాజీనామాలు చేయడం ప్రారంభించారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సహా పలువురు రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ కూడా రాజీనామా చేశారు. ఆమోదానికి ప్రభుత్వం లేనందున పెండింగ్ లో ఉంది. అయితే ఆయన కీలక ఫైళ్లను ముక్కలు చేసి వెళ్లిపోయారు.