వరుసగా మూడోసారి ప్రధానిగా మోడీ, ఈసారి ఎన్నికల్లో 400సీట్లు సొంతగానే సాధిమని చెప్పుకున్న బీజేపీకి తాజా ఎన్నికల ఫలితాలు ఇబ్బందిగా మారాయి. సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే సీట్లు కూడా రాలేదు. దీంతో పదేళ్ల తర్వాత కేంద్రంలో మిత్రపక్షాల అవసరం ఏర్పడింది.
ఏపీ నుండి చంద్రబాబు, బీహార్ నుండి నితీష్ కుమార్ ఇప్పుడు కింగ్ మేకర్స్ గా మారారు. ఇండియా కూటమి అధికార ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో బీజేపీ.. ఎన్డీయే పక్షాల మీటింగ్ ఏర్పాటు చేసింది. అయితే, చంద్రబాబు కూటమి వైపు వెళ్తారా, ఇండియా కూటమి ఏర్పాటులో కీలకంగా గతంలో ఉన్న నితీష్ కుమార్ ఎన్డీయేకు గుడ్ బై చెప్తారా అన్న చర్చ సాగుతున్న నేపథ్యంలో… చంద్రబాబు ఊహాగానాలకు తెరదించారు.
తాను ఎన్డీయేలోనే ఉన్నానని… ఎన్డీయే మీటింగ్ కోసమే ఢిల్లీ వెళ్తున్నానని స్పష్టం చేశారు. ఎదైనా ఉంటే ఖచ్చితంగా చెప్పే చేస్తానని, తాను తన రాజకీయ జీవితంలో దేశంలో ఎన్నో మార్పులు చేర్పులు చూశానన్న చంద్రబాబు… ఎన్డీయే మీటింగ్ కోసం ఢిల్లీ బయల్దేరారు.
ఎన్డీయేలోనే ఉన్నానని చెప్పిన నితీష్ కుమార్… ఇండియా కూటమిలో ఉన్న ఆర్జేడీ నేత తేజస్వీతో కలిసి ఢిల్లీ వెళ్లటం చర్చనీయాంశం అవుతున్న దశలో, చంద్రబాబుకు ఎన్డీయే కన్వీనర్ ఆఫర్ చేస్తారా అన్న చర్చ సాగుతోంది. ఎదైనా చంద్రబాబు దేశ రాజకీయాల్లో కీ రోల్ గా మారటం టీడీపీతో పాటు ఏపీకి మంచిదని, ఇప్పుడు ఏపీకి కావాల్సిన నిధులు వరదలా పారటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.