యువగళం ..టీడీపీకి జవసత్వాలు అందించింది. నారా లోకేష్ పాదయాత్ర టీడీపీకి ఆత్మ విశ్వాసం ఇచ్చింది. క్యాడర్‌కు భరోసా ఇచ్చింది. కుప్పం నుంచి ప్రారంభమైన యాత్ర సాఫీగా సాగలేదు. అనేక ఆటంకాలు సృష్టించారు. అయితే ఈ ఆటంకాలు ఓ ప్రత్యేకమైన పాదయాత్రగా నిలిపాయి. అధికారులు అనుమతులు లేవని మైకులు.. నిలబడేందుకు ఉపయోగించుకునే స్టూల్ కూడా లాగేసుకున్నారు. కానీ యువగళాన్ని మాత్రం నొక్కేయలేకపోయారు. చివరికి చంద్రబాబును అరెస్ట్ చేసి.. ఏదో సాధించామనుకున్నారు..కానీ లోకేష్‌ను నేషనల్ లెవల్లో పాపులర్ చేశారు. ఆయన ఢిల్లీలో వ్యవహారాలను ఒంటి చేత్తో చక్కబెట్టగలరన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పించారు.
ఉన్నత చదువులు చదువుకున్న లోకేష్ రాజకీయాల్లోకి వస్తే.. రౌడీయిజం తెలియదు.. జగన్ రెడ్డిలా చదువు మధ్యలో ఆపేసి రౌడీయిజం ఇమేజ్ తెచ్చుకోలేదు కాబట్టి ఆయన సాఫ్ట్..రాజకీయాలకు పనికి రాడని ముద్ర వేసేందుకు ప్రయత్నించారు. ఇందు కోసం ఎన్నెన్ని కుట్రలు చేశారో లెక్క లేదు. చాలా వరకూ సక్సెస్ అయ్యారు కూడా. కానీ లోకేష్ ఆ ఆటంకాలను ఎదుర్కొని.. తనను తను నిరూపించుకంటూ వస్తున్నారు. బాగా చదువుకున్నా.. . నిజంగా నాయకుడు అంటే అలా ఉండాల్సిందే అని ప్రజల మనసుల్లో ముద్ర వేసినట్లుగా మారేందుకు ప్రయత్నించారు.
దూకుడుగా మాట్లాడినా.. దౌర్జన్యంగా చేసినట్లుగా అనిపించినా… తప్పును ఎదుర్కొనే విషయంలో తగ్గనని నిరూపించేలాగా మారిపోయారు. తన వేష, భాషలే కాదు.. మాటలను కూడా మార్చి నిరూపించారు. ఒకప్పుడు చిన్న మాట తడబడితే… ట్రోల్ చేయడానికి వేల మంది రెడీగా ఉండేవారు. ఇప్పుడు లోకేష్ వారికి అలాంటి అవకాశం ఇవ్వడం లేదు.. ఇప్పుడు లోకేష్.. అన్నింటినీ అధిగమించిన నాయకుడు… ఈ నాయకుడ్ని తీర్చిదిద్దింది యువగళమే. !