ఏపీలో ఎన్నికల ఫలితాలు రాగానే వేణుస్వామి అనే స్వయం ప్రకటిత జ్యోతిషవేత్త రెండు చేతులెత్తి నమస్కారం పెట్టి భవిష్యత్ లో ఇక ప్రెడిక్షన్స్ చెప్పనని వేడుకున్నారు. జ్యోతిష్యం పేరుతో ఆయన చేసిన వ్యాపారం… చెసిన తప్పులు అన్నీ ఇన్నీ కావు. చివరికి ఆయన జాతకం బాగోలేదని తేలడంతో తానిక ప్రిడిక్షన్స్ చెప్పేది లేదని ఆయన దండం పెట్టుకుని క్షమాపణలు చెప్పుకుంటూ వీడియోలు విడుదల చేశారు. వేణుస్వామి వృత్తి జాతకాలు చెప్పుకోవడం.. డబ్బులు ఎవరు ఇస్తే వారికి అనుకూలంగా యూట్యూబ్ చానళ్లలో జాతకాలు చెప్పి తప్పుచేశారని ఒప్పుకున్నారు. మరి ఆయనకు ఉన్నంత నిజాయితీ నాగేశ్వర్, తెలకపల్లి రవిలకు ఉందా ?
ప్యాకేజీ కోసం దారి తప్పిన మేధావులు !
నాగేశ్వర్, తెలకపల్లి రవిలు వైసీపీ కోసం గత ఆరు నెలలుగా ఎంత కష్టం చేశారో చెప్పాల్సిన పని లేదు. వీరే కాదు కొన్ని వందలమంది చేశారు. వీరి గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే వీరికి సమాజంలో కాస్తంత గుర్తింపు ఉంది. కమ్యూనిస్టు నేతలే అయినప్పటికీ ఎంతో కొంత మేధావులుగా గుర్తింపు పొందారు. కానీ వీరు వైసీపీకి పూర్తిగా అమ్ముడుపోయి చేసిన వీడియోల వ్యాపారంతో ఏపీలో ప్రజాభిప్రాయాన్ని మార్చాలని చూశారు. తప్పులు చేసిన జగన్మోహన్ రెడ్డిని అడ్డగోలుగా సమర్థించి.. ఎంత సమర్థిస్తే అంత భారీ మొత్తంలో తమకు వచ్చే లబ్ది గురించే ఆలోచించారు. అయితే అక్కడ తమకు తాము క్రెడిబులిటీని అమ్ముకుంటున్నామన్న సంగతిని మాత్రం గుర్తించలేకపోయారు.
జగన్ చేసిన ప్రతి అడ్డగోలు పనిని సమర్థించి పరువు పోగొట్టున్న వైనం !
నాగేశ్వర్ జగన్ చేసిన ప్రతి అడ్డగోలు పనిని సమర్థించారు. చివరికి పాస్ బుక్కులపై పేర్లు వేసుకోవడాన్ని కూడా సమర్థించారు. ఇంత బతుకు బతికి మురిక్కాలవలో తన పేరు ప్రఖ్యాతుల్ని కలిపేసుకోవడానికి ఆయన అంగీకరించలేదు. జగన్ కు అనుకూలంగా మాట్లాడేందుకు ఓ ఏజెన్సీతో ఆయన ఒప్పందం చేసుకున్నారన్నది వైసీపీలో అందరికీ తెలుసు. అయితే డబ్బుల కోసం నాగేశ్వర్ ఇలా వ్యవహరిస్తారా అని.. మాత్రం అందరూ అనుకోలేకపోయారు. కానీ ఆయన చేశారు. చివరికి పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా జగన్ గెలుస్తారని చెప్పి… తన పేమెంట్ కు న్యాయం చేశానని అనుకున్నారు..కానీ ఆయన మరోసారి ఎవరూ నమ్మకుండా తన క్రెడిబులిటీని అమ్మేసుకున్నారు. తెలకపల్లి రవి గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయన గోడమీద పిల్లి. జగన్ పార్టీ నుంచి ఆయనకు ఎంత సాయం అందుతుందో ఆయన సన్నిహితులకు తెలుసు. వీరిద్దరూ కలిసి బ్లూ మీడియాలో ..యూట్యూబ్ చానల్స్ లో చేసిన భజనతో.. వీరి క్రెడిబులిటీ మొత్తం పోయింది.
వేణుస్వామి చేసినట్లు చేస్తే గౌరవం మిగులుతుంది !
ఈ ఇద్దరు స్వయం ప్రకటిత మేధావులు ఇక నుంచి రాజకీయ జోస్యాలు, విశ్లేషణలు చేస్తే.. ఈ మధ్య కాలం లో వీరు జగన్ కోసం చేసిన శ్రమ గుర్తుకు వస్తుంది. అందుకే మేధావులుగా తమకు ఏమైనా గుర్తింపు మిగలాలంటే… ఖచ్చితంగా వేణు స్వామి బాటలోకి వెళ్లాల్సిందే. ప్రజలకు క్షమాపణలు చెప్పి తాము ఇక ఎనాలసిస్లు చేయబోమని.. ప్రకటించుకోవాలి. లేకపోతే వేణుస్వామికి ఉన్నంత విలువలు కూడా లేకుండా పోతాయి.