ప్రశాంత్ కిషోర్ స్థాపించిన ఐ ప్యాక్ ప్యాక్ అయిపోయింది. ఆయన సంస్థ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక్క చోట్ల కూడా సక్సెస్ ఫుల్ స్ట్రాటజీ ఇవ్వలేదు. ఏపీలో జగన్ పరిస్థితి అత్యంత ఘోరంగా మారడంతో మరోసారి ఐ ప్యాక్ తో కలిసి పని చేసే అవకాశం లేదు. మరే రాష్ట్రంలోనూ ఐ ప్యాక్ తో పార్టీలకు ఒప్పందాలు లేవు. ఏపీ పలితం చూసిన తర్వాత ఎవరికైనా ఆ సంస్థతో పని చేయాలనే ఆలోచన ఉన్నా విరమించుకుంటారు.
ఐ ప్యాక్ అత్యంత కాస్ట్లీ రాజకీయాలు చేసింది. గెలవడానికి ఎంతైనా ఖర్చు పెడతామన్న జగన్మోహన్ రెడ్డి ఆశల్ని సొమ్ము చేసుకుంది. అక్కడ ఒక్కొక్కరికి కోట్లలో ప్యాకేజీలు ఉంటాయని చెబుతారు. కొన్ని వందల కోట్లు లాగేసిన తర్వాత ఐ ప్యాక్ ఘోర పరాజయాన్ని సమర్పించి దుకాణం సర్దేసి వెళ్లిపోయింది.
ఐ ప్యాక్ బదులుగా అందరి దృష్టి షో టైమ్ కన్సల్టెన్సీపై పడింది. అది టీడీపీకి పని చేసిన ఏజెన్సీ. ఐ ప్యాక్ వ్యవస్థాపకుల్లో ఒకరైన రాబిన్ సింగ్ ఏర్పాటు చేశారు. టీడీపీ కోసం పని చేశారు. ఆ సంస్థ మంచి ఐడియాలు ఇచ్చిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.అందుకే ఇప్పుడు షో టైమ్ కన్సల్టింగ్ పేరు రాజకీయవర్గాల్లో మారు మోగిపోతోంది.