రెండో సారి కేశినాని నాని ఎంపీగా గెలిచిన తర్వాత ఆయన అహం ఎక్కడికో పోయింది. ఎంతగా అంటే.. టీడీపీని చూసి నాకు ఓట్లేయడం ఏమిటి.. నన్ను చూసే టీడీపీకి ఓట్లేశారు అన్నంతగా మారింది. చివరికి అహంకారం పార్టీ మారి.. రాజకీయ జీవితాన్ని సమాధి చేసుకోవడం వరకూ సాగింది. గెలిచిన ముగ్గురు ఎంపీల్లో ఆయన మాత్రమే ..తనను మించిన వారు లేరన్నట్లుగా ఉండేవారు. ఎంతగా అంటే కృష్ణా జిల్లాలో పార్టీ అంతా తనకు అప్పచెప్పాలన్నట్లుగా ఉండేది శైలి. చంద్రబాబుకు పుష్పగుచ్చం ఇవ్వడానికి కూడా ఆయన నిరాకరించి మీడియా ముందు తోసేసిన సందర్భాలు ఉన్నాయి.
టాటా ట్రస్టును తానే కనిపెట్టినట్లుగా ఆయన చేసిన రాజకీయం కూడా ఎబ్బెట్టుగా మారింది. మున్సిపల్ ఎన్నికల సమయంలో పార్టీ పరిస్థితి తెలిసి కూడా ఆయన ఏకపక్షంగా తన కుమార్తెను మేయర్ అభ్యర్థిగా ప్రకటించుకున్నారు. తానే గెలిపించుకుంటానని సవాల్ చేశారు. ఓడిపోయిన తర్వాత మాట మార్చారు. చివరికి చంద్రబాబు కేశినేని చిన్ని రూపంలో ప్రత్యామ్నాయాన్ని చూశారు. ఇప్పుడు చిన్న దాదాపుగా మూడు లక్షల ఓట్ల తేడాతో నానిపై విజయం సాధించారు.
సోదరుడితో కూడా నానికి వ్యక్తిగత గొడవలు వచ్చాయి. కుమార్తె పెళ్లికి కూడా పిలవలేదు.ఇలాంటి మైండ్ తో కేశినేని నానిని భరించడం కష్టమని టీడీపీ నేతలు మెల్లగా సైడ్ చేశారు. వైసీపీ వాళ్లు నెత్తిన పెట్టుకున్నారు. కేశినేని నాని బలం ఇసుమంత కూడా లేదని ఈ ఎన్నికతో తేలిపోయింది.