ఏపీ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా ఎంపీలందరూ కలిసి పనిచేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఎంపీలకు సూచించారు. స్టేట్ ఫస్ట్ అనేదే తమ నినాదం అని, దీన్ని దృష్టిలో పెట్టుకొనే ఎంపీలందరూ పనిచేయాలని దిశానిర్ధేశం చేశారు.
పదవులు ఏవీ శాశ్వతం కాదని… సీఎంగా ప్రమాణస్వీకారానికి ప్రధాని మోడీ వచ్చే అవకాశం ఉందన్నారు. అందుబాటులో ఉన్న ఎంపీలతో చంద్రబాబు భేటీ అయి, శుక్రవారం ఢిల్లీలో జరిగే ఎన్డీయే సమావేశంపై చర్చించారు.
అయితే, ఈ సమావేశంలో కేంద్రమంత్రి పదవులు, ఎవరికి మంత్రి పదవులు దక్కబోతున్నాయన్న అంశాన్ని చంద్రబాబు ఏమాత్రం ప్రస్తావించలేదు. అయితే, పదవులు దక్కిన వారు ఆ పదవులు శాశ్వతం అనుకోవద్దంటూ ఇండైరెక్ట్ గా సూచించారు. సమస్యలపై దృష్టిపెట్టాలని, ఆకాశంలో విహరించొద్దంటూ ఎంపీలకు మార్గదర్శకం చేశారు.
మరోవైపు ఒడిశాలో జరిగే బీజేపీ సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమానికి హజరయ్యే అవకాశం ఉందన్నారు. ఇక ఈనెల 11న టీడీఎల్పీ సమావేశం జరబోతుంది. అదే రోజు తమ నేతగా చంద్రబాబును ఎన్నుకునే అవకాశం ఉంది.