రాజకీయాలు ఆలోచనా పరులకే కానీ ఆవేశ పరులకు కాదు. అహంకారులకు అంతకంటే కాదు. చేతికి వచ్చిన అధికార అవసరం లేని పగ సాధించడానికి, ప్రతిపక్షాలను వేధించడానికి, అడ్డగోలు సంపాదనల కోసం అసలే కాదు.అలా అనుకున్న వారికి శంకరగిరి మాన్యాలు పట్టించడానికి ప్రజలు ఎంతో కాలం ఆలోచించరు. ఆంధ్రప్రదేశ్అసెంబ్లీ ఎన్నికలు మరోసారి నిరూపించారు. ప్రజలు నొక్కిన బటన్‌కు.. వైసీపీ పాతాళంలోకి పడిపోయింది. నిన్నటిదాకా సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కనీసం ప్రతిపక్ష నేత కూడా కాదు. సాదాసీదా ఎమ్మెల్యే. ప్రజలిచ్చిన పవర్ ను దుర్వినియోగం చేస్తే వారి పవర్ ను పీకేయడానికి ప్రజలు ఏ మాత్రం ఆలోచించరు.
ముసలాయన చేతిలో చావు దెబ్బ తిన్న కుర్రాడు జగన్
జగన్ రెడ్డి తాను కూడా మధ్య వయస్కుడిని అని మర్చిపోయి చంద్రబాబుపై పేట్రేగిపోయారు. వయసుకు కూడా గౌరవం లేకుండా ముసలాయన అంటూ చంద్రబాబుపై రెచ్చిపోయారు. కానీ బస్సులో నుంచి దిగడానికి మెట్లు వాడే జగన్ రెడ్డికి… తిరుమలకు ఆగకుండా కాలినడకన వెళ్లగలిగే చంద్రబాబుకు పోలికే ఉండదు. 40 డిగ్రీల ఎండల్లో చంద్రబాబు రోజంతా మూడు నాలుగు సభల్లో పాల్గొంటే.. రెండు రోజులకో సారి విశ్రాంతి తీసుకుని ప్రచారం చేసేవాడు జగన్. ఇంకా చెప్పాలంటే… ఐదేళ్లు పనితీరులో ఇతరుల్ని ముసలోడు అని విమర్శించినందున తాను కుర్రాడ్ని అని నిరూపించుకునే ప్రయత్నం చేయలేదు. చంద్రబాబు వయసుతో పాటు వృద్ధుడుకావొచ్చు కానీ జగన్ రెడ్డి మాత్రం పుట్టుకతోనే వృద్ధుడు అని నిరూపించుకున్నారు. ఐదేళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. కుర్రోడయితే కనీసం అభివృద్ధి చేసేవారు.
ముసలాయన చంద్రబాబు ప్రభంజనం ముందు ఇప్పుడు స్వయం ప్రకటిత కుర్రాడు జగన్ రెడ్డి అడ్రస్ లేకుండా పోయాడు. రాజకీయాల్లో అహంకారానికి ప్రజలు ఎలా సమాధి కడతారో దానికి జగనే పెద్ద సాక్ష్యం. మంచి చేస్తానని చెప్పి..ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి.. ఐదేళ్ల పాటు కక్ష సాధింపే పాలన అన్నట్లుగా సాగించుకున్నారు. టీడీపీ నేతల్ని అరెస్టు చేయడమే తమ లక్ష్యం అన్నట్లుగా పేట్రేగిపోయారు. చివరికి చంద్రబాబును అరెస్టు చేశారు. అప్పుడే అందరూ చెప్పారు… జగన్ రెడ్డి నీ గొయ్యి నువ్వు తవ్వుకున్నావని.. కానీ అధికార మత్తు నెత్తికెక్కిన జగన్ రెడ్డికి అప్పట్లో అవేమీ వినిపించ లేదు., చంద్రబాబును శారీరకంగా, మానసికంగా ఎంత హింస పెడుతున్నామన్నదే చూసుకుని మానసిక ఆనందం పొందారు. రాజకీయాల గురించి కనీస అవగాహన ఉన్న వారుకూడా ఆ పని చేయరు కానీ జగన్ రెడ్డి వికృతత్వం వేరు. తాను మనుషుల్ని పీక కోసి చంపినా సరే కరెక్ట్ అంటాడు.. వేరే వారు ఏం చేసినా సరే తప్పు అంటారు. అలాంటి మనస్థత్వం మారదు కాబట్టి.. ఇప్పుడు పాతాళానికి పడిపోయారు.
ఓట్లు వేసిన పేదల రక్త మాంసాలు పీల్చిన ఒకే ఒక్క పాలకుడు
చరిత్రలో తనకు అధికారం ఇచ్చిన ఓటు బ్యాంక్ ను దోచుకున్న నేత ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క జగన్ రెడ్డి మాత్రమే. నిరక్ష్యరాస్యులు, బడుగులు ఎక్కువగా జగన్ కే ఓటు వేస్తారు. వారి అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని జగన్ రెడ్డి వారిపై దోపిడీకి పాల్పడ్డారు. మధ్య నిషేధం పేరుతో షాక్ కొట్టే ధరలను తెస్తానని చెప్పి సొంత బ్రాండ్లను దింపి ఇష్టానుసారంగా మద్యం స్కాం చేశారు. ఇది పేద ప్రజల రక్తాన్ని పీల్చడమే. ఓ ఉద్యోగి రూపాయికి… ఓ నిరుపేద రూపాయికి విలువలో చాలా తేడా ఉంటుంది. రోజంతా కష్టపడితే ఆరేడు వందలు సంపాదించుునే కూలీ… ఆ శ్రమ నుంచి రిలీఫ్ పొందేందుకు యాభై రూపాయలు పెట్టి మద్యం కొనుక్కునేవారు.కానీ జగన్ రెడ్డి వాళ్లతో మద్యం మానిపిస్తానని కథలు చెప్పి..దాన్నిరెండు వందల యాభై చేశారు. అంటే.. సంపాదనలో సగం ప్రభుత్వం లాగేసింది. ఇక్కడ ప్రభుత్వానికి వెళ్లే దాంట్లో సగానికన్నా జగన్ రెడ్డి ఎక్కువ వెనకేశారు. ఆ పిచ్చి మందు తయారీ నుంచి అమ్మకం వరకూ అంతా .. జగన్ ముఠా కనుసన్నల్లోనే నడిచింది. చివరికి అంతా క్యాష్ పద్దతిలోనే ట్రాన్సాక్షన్లు చేశారు. ఇలాతనకు అండగా ఉన్న పేద రక్తమాంసాలు పీల్చారు జగన్ రెడ్డి. ఇది ఒక్కటేనా ఎప్పుడో ముఫ్పై ఏళ్లకిందట వేరే ప్రభుత్వాలు ఇచ్చిన ఇళ్లకు ఇప్పుడు లోన్లు వసూలు చేశారు. వారు కూడా రెక్కాడితే డొక్కాడని పేదలే. ఇళ్ల స్థలాల పేరుతో చేసిన మోసం మరో రేంజ్. పార్టీ నేతలకు పనికిమాలిన స్థలాలకు వేల కోట్లు దోచి పెట్టి పేదలకు సెంట్ స్థలం ఇచ్చారు. అవి ఎందుకూ పనికి రావని వైసీపీ నేతలే అసభ్యమైన ఉదాహరణలతో చెప్పారు. కానీ అందులో బెదిరించి ఇళ్లు కట్టుకునేలా చేసి లక్షలకు లక్షలు అప్పులు పాలు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే పేదల పాలిట పరమ రాక్షసత్వంగా పరిపాలన చేశారనేది పచ్చి నిజం. ఇప్పుడా పేదలంతా కలిసి బండ కేసి కొట్టారు. విద్య, ఉద్యోగ, వైద్య రంగాల్ని నిర్లక్ష్యం చేశారు. కానీ ప్రచారంలో మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. బటన్ లు నొక్కి ఖాతాలలో వేసేది రెండో.. మూడో కోట్లు అయితే.. తన పత్రికకు వందల కోట్ల ప్రకటనలు ఇచ్చుకుంటారు. తన సిమెంట్ ను రాష్ట్ర వ్యాప్తంగా వాడేలా చేసుకుంటారు. ఇలా సొంత వ్యాపారాలను పెంచుకుని….రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు.
మానసిక రోగిలా తిట్లు, దాడులతో ఆనందం -అదేనా పాలన !
మానసిక రోగిలా ప్రతిపక్ష నేతల కుటుంబాలను తిట్టించడం… వాటిని విని ఆనందించడం.. తన మనసుకు నచ్చేలా తిట్టిన వారికి పదవులు ఇవ్వడం .. చంద్రబాబు ఇంటిపై దాడులకు వెళ్లిన వారికి పదవులు ఇవ్వడం.. న్యాయవ్యవస్థపై దాడి చేసిన వారికి రివార్డులు ఇవ్వడం .. ఇదా పరిపాలనా ? . చివరికి ప్రజలు కొట్టిన దెబ్బకు పాతళంలో పడిపోయిన తర్వాత అయినా తెలుసుకున్నాడా అంటే లేదు.. తాను డబ్బులిచ్చానని ఓట్లు ఎందుకు వేయలేదని అడుగుతున్నాను మహానుభావుడు. ఆ డబ్బులన్నీ వాళ్ల దగ్గర పీల్చి పిప్పి చేసినవేనని..పైగా వారి రక్తమాంసాల్లో వాటా కూడా తీసుకున్నారని వారికి క్లారిటీ వచ్చింది. అందుకే ఇంటికి పంపారు. అదేమీ తెలియదన్నట్లుగా ఆప్యాయతలు, ఆదరాభిమానాలు ఏమైనాపోయాయో అని నటన మొదలు పెట్టారు. రోడ్డు మీదకు వస్తే రాళ్లతో కొడతారన్న భయంతోనే కదా ఐదేళ్లు కాలు నేల మీదకు పెట్టకుండా తిరిగింది…?. ఇంకా తెలియనట్లుగా నటిస్తూఎవరిని మోసం చేస్తారు ?
తప్పు చేస్తున్నావయ్యా అని ఎన్నో సార్లు హెచ్చరించిన తెలుగు 360
తనకు ఎదురే లేనద్నట్లుగా తన క్రిమినల్ మైండ్ సెంట్ తో .. ఎవర్నీ వదల్లేదు. మీడియా యాజమాన్యాలను ఆయన వేధించిన తీరు చూసి ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. ఈనాడు పత్రిక నిజాల్ని ప్రజలకు చెబుతోందని ఆ సంస్థ ఆర్థిక మూలాల్ని దెబ్బతీయడానికి బయలుదేరారు. అంత పెద్ద ప్రభుత్వ వ్యవస్థ పెట్టుకుని ఎన్నో తప్పుడు ప్రచారాలు చేసినా వారి వెంట్రుకకూడా పీకలేకపోయారు. కానీ తాము తల్చుకుంటే ఏం చేయగలమో తెలుసా అని… జగన్ రెడ్డికి ముసలాయన రామోజీరావు చూపించారు. ఆయన కొట్టిన దెబ్బకు మళ్లీ లేవనలేనంత పరాజయం ఎదురొచ్చింది. ఒక్క ఈనాడును కాదు తప్పు చేస్తున్నావురా అయ్యా.. చరిత్రలో నీలాంటి నియంతలు ఎంతో మంది కలిసిపోయారు… అత్యధిక కాలం రాజకీయ జీవితంలో ఉన్న వారిని పరిశీలించు తత్వం బోధపడుతుందని ఎన్నో మీడియాలు సలహాలిచ్చినా పెడవిన పెట్టారు. చివరికి తెలుగు 360లో ఎన్నో సార్లు జగన్ తప్పిదాలను ఈ ఎడిటర్స్ కామెంట్ లోనే ఎత్తిచూపాము. దిద్దుకోలేని తప్పులు చేస్తున్నారని హెచ్చరించారు. చరిత్రలో జరిగిన రాజకీయ పరిణామాలు… హెడ్ వెయిట్ నేతల గురించి చెప్పాము… ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని ఎన్నో సార్లు చెప్పాము..అధికార అహంకారం అంతిమంగా పతనానికే కారణమవుతుందని చెప్పాము.. కానీ ఆయన వంది మాగధులు మాత్రం.. మేము ఏదో విపక్షానికి సపోర్టు చేస్తూ ఆ మాటలన్నామని మా మీద ఎదురుదాడికి దిగారు. సోషల్ మీడియాలో బూతులందుకున్నారు. తెర వెనుక నుంచి మా వెబ్ సైట్ పై దాడి చేశారు. అనుకూలంగా రాయాలని ప్రలోభ పెట్టారు. వీటన్నింటికీ కారణం తమ అరాచకాలు చేస్తాం కానీ చెప్పకూడదని.. బయటకు తెలియకుండా ఉండే చాలు ఓట్లేస్తారని అనుకోవడం. కానీ ఆ బాధలు పడుతోంది ఓటర్లేననే లాజిక్ ను మిస్సయ్యారు. ఇప్పుడు అనుభవిస్తున్నారు.
చాప్టర్ క్లోజ్ ఇక ఆశలు పెట్టుకోవద్దు !
ఐదేళ్లలో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం ఓటమితో అయ్యేది కాదు. ఎన్నో అనుభవించాల్సి ఉంది. ఎందుకంటే వ్యవస్థలన్నింటినీ చెరబట్టారు. ఇప్పుడా వ్యవస్థలన్నీ జగన్ రెడ్డి మీదకే రాబోతున్నాయి. రక్షించడానికి ఏ వ్యవస్థ కూడా రాదు. గగ్గోలు పెట్టినా జరగాల్సింది జరిగి తీరుతుంది. అసలు క్రింజ్ ఏమిటంటే… ఆయన కూలీ మీడియా కూడా ఇప్పుడు తిరగబడుతుంది… అది కూడా ఆయన వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లదు. తన మీడియాను ప్రజలు నమ్మరు. మీడియాను కూడా వదలని జగన్ రెడ్డి నైజం ఇప్పుడాయనకు అసలు సిసలు నరకం చూపించబోతోంది. … ఓ సినిమాలో విలన్‌కు బ్రహ్మానందం చెప్పినట్లు… జగన్ ముందే దీపావళి వస్తుంది… అది ఐదేళ్ల పాటు ఉంటుంది. ఎక్కడ అంటుకుంటుందో చెప్పడం కూడా కష్టం. ఇప్పుడు మా మీద కోపంతో కూటమికి ఓట్లు వేశారు.. తర్వాత కూటమిపై కోపంతో మాకు వేస్తారని.. ఆశలు పెట్టుకుంటున్నారేమో… కానీ జగన్ రెడ్డి చేసిన విధ్వంసం చూసిన ఎవరైనా భవిష్యత్ ఓటు వేయాలంటే భయపడతారు. అందుకే ఇక శాశ్వతంగా సెలవు తీసుకుంటే మంచిది!