ఎన్నికలకు ముందు ఖర్చుల కోసం అన్నట్లుగా విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్స టీచర్ల బదిలీలు చేసి సొమ్ము చేసుకున్నారు. రెండు వేల మంది టీచర్ల బదిలీలకు బేరం పెట్టి పెద్ద ఎత్తున వసూళ్లూ చేశారు. ప్రభుత్వం మారకతే ఏ సమస్యా ఉండేది కాదు.. కానీ ప్రభుత్వం మారింది. ఇంకా సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టకపోయినప్పటికీ గెలుపు ఖాయం కావడంతో టీడీపీ నేతల ఆదేశాల మేరకు.. బదిలీలను ఆపేశారు అధికారులు. దీంతో బొత్స గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది.
డబ్బులు ఇచ్చిన వారు కామ్ గా ఉండేందుకు సిద్ధంగా లేరు. ఆందోళనకు దిగుతున్నారు. తమ దగ్గర లంచాలు తీసుకుని బదిలీలు చేయలేదని ఆందోళనకు సిద్ధమవుతున్నారు. పోలీసులకు కూడా ఫిర్యాదులు చేసే అవకాశం ఉంది. బదిలీల వెనకు గూడుపుఠాణి ఏమిటో అందరికీ తెలుసు కాబట్టి… మొత్తం బయటకు లాగడం పెద్ద విషయం కాదని.. అది నేరుగా బొత్స దగ్గరకే పోతుందని అంటున్నారు. బొత్స పీఏనే నేరుగా డబ్బులు వసూలు చేశారని బదిలీల కోసం డబ్బులు ఇచ్చిన వాళ్లు బహిరంగంగా నే చెబుతున్నారు.
ఈ విషయంలో బొత్స సత్యనారాయణ నిండా మునిగిపోయారు. నిజానికి విద్యాశాఖలో బొత్సకు అవగాహన లేకపోయినా టోఫెల్ అని.. ఐబీ అని లెక్కలేనన్ని స్కాములు చేశారు. వాటిలో బొత్సకు వాటాలో ఉందో తెలియదు..కానీ భరించాల్సింది మాత్రం ఆయనే. వోక్స్ వ్యాగన్ స్కాంలో బయటపడిపోయారు కానీ.. గత ఐదేళ్లుగా చేసిన నిర్వాకాలతో ఆయన బయటపడే అవకాశాలు కనిపించడం లేదు.