సాక్షి ప్రింట్ ఆర్డర్ లో అరవై శాతం కోత పడింది. పేపర్ వేస్టేజీ వద్దని ఆదేశాలు ఆరవై శాతం ప్రింటింగ్ తగ్గించేశారు. జగన్ ఘోరంగా ఓడిపోవడంతో వాలంటీర్లకు అమ్ముతున్న ప్రతులు దగ్గర నుంచి ప్రభుత్వం తరపున కొనుగోలు చేసే ప్రతి కాపీని ఆపేశారు. దీంతో సర్క్యూలేషన్ కూడా అరవై శాతం పడిపోయింది.
ఇప్పటి వరకూ ప్రతి రోజూ సాక్షికి ప్రకటనలే కాదు.. ప్రజాధనంతో పత్రికల్నీకొనిపించారు. రెండున్నర లక్షల మంది వాలంటీర్లకు రూ. రెండు వందలు ఇచ్చి మరీపేపర్ కొనిపించారు. అలాగే ఒక్కో గ్రామ, వార్డు సచివాలయంలో రెండేసి పేపర్లు వేస్తున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల్ని బెదిరించి పేపర్లు కొనిపించారు యూనివర్శిటీలు సహా ఇతర చోట్ల.. బలవంతంగా పేపర్ అంట కట్టారు. ఇంత చేస్తున్నా ఆ పత్రిక సర్క్యూలేషన్ … ఏపీలోఆరు లక్షల లోపే . డబ్బులు పెట్టే కొనే నిఖార్సైన పాఠకులు సాక్షి పత్రికకు లేరు.
ఖచ్చితంగా ఏపీలో సాక్షికి డబ్బులు పెట్టి కొనే చందాదారులు లక్ష నుంచి రెండు లక్షలు లోపే. ఇప్పుడు ఆ కొద్ది మాత్రమే ప్రింట్ చేస్తున్నారు. అప్పనంగా దొరకిన అధికారంతో ప్రజాసొమ్ముతో సాక్షిని నిలబెడుతూ వచ్చారు. ఇప్పుడు అధికారం పోవడంతో కుప్ప కూలడమే మిగిలింది.