పథకాల లబ్దిదారులు జగన్ ను మోసం చేశారంటూ వైసీసీ నేతలు కొత్త రాగం అందుకుంటున్నారు. మీకేం తక్కువ చేశామంటూ కాకాణి గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్లు పోస్టింగులు పెట్టి రెచ్చగొడుతున్నారు. కానీ పథకాల లబ్దిదారులు మాత్రం తమకు ఇచ్చిన దాని కన్నా దోచిందే ఎక్కువన్న క్లారిటీ రావడంతోనే ఓడించారు. తమ ఓటు బ్యాంక్ లాంటి పేదల్ని జగన్ ఎలా దోచుకున్నారో కళ్లకు కట్టినట్లుగా చెబుతున్నారు.
జగన్ సర్కార్ పేదల రక్తం తాగింది. మద్యం ధరలు, వన్ టైమ్ సెటిల్మెంట్, ఇంటి వద్దకే రేషన్ బియ్యం, చెత్త పన్ను , ఆస్తి పన్ను, అందరికీ ఇళ్లు ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ ఇబ్బంది పెట్టారు. పేద కుటుంబాలను మద్యం ధరల మరింత చితికిపోయేలా చేశాయి. వన్ టైం సెటిల్మెంట్ స్కీం. ఓటీఎస్ పేరుతో పేద ప్రజలను ఏపీ సర్కార్ అప్పుల పాలు చేసింది. ముఫ్పై ఏళ్ల కిందట తీసుకునన్న రుణాలను కూడా ముక్కు పిండి వసూలు చేశారు ముఫ్పై లక్షల మందికి ఇళ్ల స్థలాలంటూ.., ప్రభుత్వం ఎంత హడావుడి చేశారు. ఆ ఆళ్లు ఎందుకూ పనికి రావు. ఇలా స్థలాలు పొందిన లబ్దిదారుల్లో లక్షల మంది ఇప్పటికే లక్షల రూపాయల అప్పులు చేసి వడ్డీలు కట్టుకుంటున్నారు.
పేదలు రేషన్ బియ్యం మీదే ఎక్కువ ఆధారపడుతున్నారు. రేషన్ డీలర్ల దగ్గర్నుంచి ఇంటింటికీ రేషన్ సరఫరా పేరుతో వాహనాలకు ఎక్కించి..వారి దగ్గర్నుంచి బియ్యం మాఫియాకు తరలించారు. ఇక వారి ఉపాధి అవకాశాల్ని మెరుగుపరిచారా అంటే అదీ లేదు. చివరికి ఫ్లెక్సీలు వేసుకునే వాళ్లనీ వదిలి పెట్టలేదు. అందరూ కలిసి కర్రు కాల్చి వాత పెట్టారు. మరోసారి జగన్ ఏపీలో వచ్చే అవకాశం లేదని నిరూపించారు.