వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయిన వైసీపీ నేతలు ముఖ్యంగా వైసీపీ నేతలకు ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకు రావడానికి భయం పట్టుకుంది. టీడీపీ ప్రధాన కార్యాలయంపై తన మూకను వేసుకుని దాడులు చేసిన దేవినేని అవినాష్, పట్టాభి ఇంటిపై దాడులు కూడా దాడులు చేయించారు. ఇప్పుడాయన వణికిపోతున్నాడు. ఆయన ఇంటిపై దాడులు చేస్తారని సమాచారం రావడంతో పోలీసులు ఇంటి చుట్టూ ముళ్ల కంచే వేశారు. ఇంట్లో నంచి బయటకు రావొద్దని దేవినేని అవినాష్ కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ఇలా జాగ్రత్తలు తీసుకోవడానికి కారణం.. అందకు ముందే వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇళ్లపై దాడులు జరగడం.
విజయవాడలోని ఓ ఆపార్టుమెంట్ లో ఉండే వల్లభనేని వంశీ ఇంటిపైకి కొంత మంది వ్యక్తులు వెళ్లారు. అయితే పోలీసులు ముందు జాగ్రత్తగా వారిని పోనివ్వలేదు. ఆ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. వంశీ ఇంట్లోనే ఉన్నారు. దాంతో ఆయన కార్లను ధ్వంసం చేశారు. కిందకు రావాలని సవాల్ చేశారు. పోలీసులు అందర్నీ తరిమికొట్టారు. వీరు తీసుకు వచ్చిన ఓ కారులో రాళ్లు, పెద్ద కత్తి ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అంతకు ముందు కొడాలి నాని ఇంటిపై కి కూడా కొంత మంది వెళ్లారు. వారు కోడిగుడ్లు, రాళ్లు విసిరారు. పోలీసులు వారిని కూడా లాఠీచార్జ్ చేసి తరిమేశారు.
తెలుగుదేశం పార్టీ నేతలు, చంద్రబాబు, లోకేష్ వారి కుటుంబసభ్యులపై వీరు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ప్రభుత్వం మారడంతో వీరి పరిస్థితి గడ్డుగా మారింది. అమెరికాలో సెటిల్ అయ్యేందుకు వంశీ ఏర్పాట్లు చేసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇంకా ప్రభుత్వం ఏర్పడకపోవడంతో ఆయన విజయవాడలోనే ఉన్నారు. కానీ ఈ లోపే ఆయనను టార్గెట్ చేసుకున్నారు. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి ఘటనతో అవినాష్ టీడీపీ నేతలకు టార్గెట్ అయ్యారు. వీరందరికీ పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు.