బీఆర్ఎస్ ఖాళీ చేసే పనిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీసుకున్నారు. కాంగ్రెస్ లో చేరి సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చిన ఆయన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పూర్తిగా బలహీనపడటంతో.. కొత్త ఐడియాతో తెరపైకి వచ్చారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీలోకి రావాలని మాజీ మంత్రి దానం నాగేందర్ ఆహ్వానించారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీకి కనీసం డిపాజిట్లు కూడా రాలేదని.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గెలిచిన నియోజకవర్గాల్లోనూ డిపాజిట్లు రాలేదని చెప్పుకొచ్చారు. కాబట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వారి రాజకీయ భవిష్యత్తు కోసం, రాజకీయ మనుగడ కోసం కాంగ్రెస్ పార్టీలోకి రావాలని సలహా ిచ్చారు. రాజకీయంగా ప్రజాక్షేత్రంలో ఉండాలని కోరుకునే వారు… ప్రజాసేవ చేయాలని కోరుకునే వారు కాంగ్రెస్ పార్టీలోకి రావాలన్నారు.
కాంగ్రెస్ లోకి స్తే రేవంత్ రెడ్డి వారికి తగిన గౌరవం ఇస్తారని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ లోకి ఎందుకు రావాలో వారికి డౌట్ వస్తుంది.. బీజేపీలోకి వెళ్లొచ్చ కదా అనుకుంటారు. అందుకే దానికీ దానం నాగేందర్ క్లారిటీ ఇచ్చారు. అయోధ్యలోని లోక్ సభ నియోజకవర్గంలోనే ఆ పార్టీ ఓడిపోయిందన్నారు. అలాగే వారణాసిలో 2019లో ఐదు లక్షలకు పైగా మెజార్టీ వచ్చిన మోదీకి ఈసారి లక్షకు పైగా మాత్రమే వచ్చిందన్నారు. ఈ కారణంగా బీజేపీకి భవిష్యత్ ఉండదని.. అంతా కాంగ్రెస్ హవానేనని అందుకే కాంగ్రెస్ లోకి రావాలంటున్నారు.