ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. ఫలితాల తర్వాత ఈవీఎంలపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఓడిపోయిన తర్వాత జగన్ రెడ్డి కూడా ఎవరో ఏదో చేశారని అనవచ్చు కానీ ఆధారాల్లేవని చెప్పుకొచ్చారు. ఆయన ఉద్దేశం ఈవీఎంలపై అనుమానమే. నిజానికి 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఈవీఎంలకు వ్యతిరేకంగా ఓ యుద్ధమే చేశారు. ఎన్నికలకు ముందు ..ఆ తర్వాత కూడా మాట్లాడారు. అయితే ఓటమిని ఈవీఎంలపై వేయడానికి ఈ మాటలు చెబుతున్నారని వైసీపీ విమర్శించింది.
జగన్ రెడ్డి స్వయంగా ఈవీఎంల ఎంత పర్ ఫెక్ట్ గా పని చేస్తాయో చెప్పిన వీడియో ఇప్పుడు వైరల్ వఅవుతోంది. ఈవీఎం బటన్ నొక్కినప్పుడు తాము ఏ పార్టీకి ఓటు వేశామో ఓచర్లను కనిపిస్తుందని ఇక ఈవీఎం మ్యానిప్యులేట్ ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు.కానీ తాను ఓడిపోయే సరికి మాత్రం ఆయన మాట మార్చేశారు. అంతే కాదు వారి పార్టీ నేతలంతా ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈవీఎంలపై చర్చ జరగాలంటున్నారు.
నిజానికి ఈవీఎంలను విపక్షం వ్యతిరేకిస్తోంది. కోర్టులకు వెళ్లి పోరాడింది. కానీ వైసీపీ సమర్థించింది. టీడీపీ పోరాడినప్పుడు ఈవీఎంలు మంచివన్నారు. ఇప్పుడు ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఒకే స్టాండ్ పై ఉంటే.. వచ్చే ఎన్నికల్లో ఈవీఎంలు వద్దని అన్ని పార్టీలు కలిసి పోరాటం చేయవచ్చు. లేకపోతే ఓడిపోతే చెప్పుకోవడానికి ఓ కారణంగా ఈవీఎంలను వాడుకున్నట్లుగా స్పష్టమవుతుంది.