చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా గెలుపొందారు. గ్రాడ్యూయేట్స్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిపై విజయం సాధించారు. రెండు రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన కౌంటింగ్ లో ఎవరికీ విజయానికి అవసరమైన యాభై శాతం ఓట్లు రాలేదు. దీంతో ఎలిమినేషన్ రౌండ్ల ద్వారా విజేతను ఖరారు చేశారు. చివరికి తీన్మార్ మల్లన్న, రాకేష్ రెడ్డి ఉండటంతో.. ద్వితీయ ప్రాధాన్య ఓట్ల ద్వారా రాకేష్ రెడ్డిని ఎలిమినేట్ చేశారు. దీంతో మల్లన్న విజేతగా నిలిచారు.
నల్లగొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యూయేట్ స్థానం బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం., పల్లా రాజేశ్వర్ రెడ్డి మూడేళ్ల కిందట విజయం సాధించారు. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఆయనపై గతంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన తీన్మార్ మల్లన్న ఈ సారి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి విజయం అందుకున్నారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎన్నికల ఎమ్మెల్సీ గెల్చుకుని ఊపిరి పీల్చుకున్నబీఆర్ఎస్కు ఈ ఫలితం చేదు మాత్రే.
ప్రజా ప్రతినిధి కావాలని తీన్మార్ మల్లన్న ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ ఎన్నిక జరిగినా పోటీ చేస్తారు. చివరికి తన ప్రయత్నాల్లో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీకి మరో ఎమ్మెల్యే యాడ్ అయినట్లయింది.