ఐదేళ్ల కిందట వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వంలో సాక్షిలో పని చేసిన వాళ్లే ఎక్కువగా చేరారు. ఫోటో గ్రాఫర్ల దగ్గర నుంచి సలహాదారు, పీఆర్వోల వరకూ అందరూ సాక్షిలో ఉండేవాళ్లే. కనీసం నాలుగయిదు వందల మందిని ఇలా తీసుకున్నారు. వీరిలో నెలకు ఐదారు లక్షలు తీసుకునే దేవులపల్లి అమర్ లాంటి సలహాదారులతో పాటు.. నలభై వేలకు పని చేసే సోషల్ మీడియా కార్యకర్తలు కూడా ఉన్నారు.
ఇప్పుడు ప్రభుత్వం పోవడంతో వీరంతా రోడ్డున పడ్డారు. తమను మళ్లీ తీసుకోవాలని సాక్షి యాజమాన్యాన్ని కోరుతున్నారు. కానీ సాక్షి యజమాన్యం మాత్రం ముందుగానే ఓ పత్రంపై సంతకం పెట్టించుకున్నామని అంటున్నారు. ఆ పత్రంలో ఏముందంటే.. మరోసారి సాక్షి ఉద్యోగంలోకి తీసుకోబోమని ఉంది. అంటే ప్రభుత్వం పోతే.. వారు ఇంటికి పోవాల్సిందే తప్ప మరో సారి ఉపాధి చూపించబోమని ముందే చెప్పినట్లయింది.
దీంతో చాలా మంది సాక్షి ఉద్యోగులు ఇప్పుడు ఫీలవుతున్నారు. ఇందులో రిపోర్టర్లు సహా కీలక ఉద్యోగులు ఉన్నారు. ఇప్పుడు వారిలో చాలా మందిని పార్టీ కోసం పని చేయించుకోవాలని అనుకుంటున్నారు. కానీ జీతాలు ఇస్తామని మాత్రం చెప్పడం లేదు. సంపాదించుకునే అవకాశం ఉన్న వారు సంపాదించుకున్నారని.. జీతంపై ఆధారపడిన వారేఇప్పుడు టెన్షన్ పడుతున్నారని.. ఇలాజగన్ ను నమ్మి మోసపోయిన వారు టెన్షన్ పడుతున్నారు.