ఏపీలో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఒడిషాలోనూ ప్రభుత్వం ఏర్పడింది. ఉదయం ఏపీలో.. మధ్యాహ్నం ఒడిషాలో ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారానికి మోదీ హాజరయ్యారు. అయితే ఏపీలో కనబడని సన్నివేశం.. ఒడిషాలో ఆవిష్కృతమయింది. బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి మాజీ సీఎం నవీన్ పట్నాయక్ కూడా హాజరయ్యారు. మోదీ సహా బీజేపీ అగ్రనేతలంతా ఆయనను ఆప్యాయంగా పలకరించారు.
దాదాపుగా పాతికేళ్ల పాటు ఒడిషాకు సీఎంగా ఉన్నారు నవీన్ పట్నాయక్. ఆయన ఆరోగ్యంపై పుకార్లు రావడంతో ప్రజలు ఈ సారి ఆయనకు విశ్రాంతినిద్దామని అనుకున్నారేమో కానీ ఓడించారు. బీజేపీకి పట్టం కట్టారు. మామూలుగా అయితే తన కోట కూలిపోయిందని ఆయన బాధపడిపోవాలి…కానీ నవీన్ పట్నాయక్ అలా అనుకోలేదు. ప్రమాణ స్వీకారానికి వచ్చారు. లోక్ సభ సీట్లలో కూడా బీడేపీకి ఈ సారి ఒక్కటి కూడా రాలేదు. మొత్తం ఇరవై ఒక్క సీట్లలో ఇరవై బీజేపీ.. ఒక్కటి కాంగ్రెస్ గెల్చుకున్నాయి.
ఏపీలో ఐదేళ్లకే అధికారం కోల్పోయిన జగన్.. కనీసం ప్రోటోకాల్ ప్రకారం.. ఇన్విటేషన్ తీసుకోవడానికి కూడా ఆసక్తి చూపించలేదు. చంద్రబాబు ఫోన్ చేసినా మాట్లాడేందుకు నిరాకరించారు. వైసీపీ తరపున ప్రతినిధుల్ని కూడా ఎవర్నీ పంపలేదు.