జగన్ రెడ్డి ప్రజల్లోకి వస్తానంటూ అప్పుడే ఆవేశ పడుతున్నారు. ఎక్కడెక్కడ మృతదేహాలు లెక్కలు వేసుకుని ఓదార్పుయాత్రకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. అయితే ఆత్మహత్యలు చేసుకుటున్న వారే కాదు.. చేసుకునే స్థితిలో ఉన్న వందల మంది వైసీపీ క్యాడర్ ను ఆయన ఆదుకోవాల్సి ఉంది. పార్టీ నుంచి సరైన సపోర్టు లేక చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు. మిగిలిన వారు ఆ దారిలో నడవకుండా చూసుకోవాల్సి ఉంది.
ఒక్క కడప జిల్లాలోని వైసీపీ క్యాడర్ పెద్ద ఎత్తున నష్టపోయింది. జగన్ మెజార్టీపైనా బెట్టింగులు కట్టి తీవ్రంగా నష్టపోయారు. వారంతా అవినాష్ రెడ్డి వద్దకు సాయం కోసం వెళ్తున్నా పట్టించుకోవడం లేదు. కడపలోనే అలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎన్ని వేల మంది ఉన్నారో చెప్పాల్సిన పని లేదు. జగన్ రెడ్డి ఐ ప్యాక్ ఆఫీసుకు వెళ్లి చెప్పిన మాటలు.. ఆరా మస్తాన్ పెయిడ్ సర్వే కారణంగానే ఎక్కువ మంది మునిగిపోయారు. అది క్యాడర్ పై ఉద్దేశపూర్వంగా వేసిన ట్రాప్ లా మారిపోయింది.
ఓదార్పు యాత్ర చేయడానికి శవాలు అవసరం అయితే.. పార్టీ క్యాడర్ ను చంపుకోవాల్సిన పని లేదు. ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న వారి కోసం హెల్ప్ లైన్లు పెట్టి.. బెట్టింగ్ బాధితులకు అండగా ఉంటేనే క్యాడర్ నిలబడుతుంది. చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్ర చేసి తలా ఓ లక్ష చేతిలో పెడతానంటే.. ఆ కుటుంబాలు కూడా ఆసహ్యించుకునే అవకాశం ఉంది.