ప్రభుత్వం మారింది .. చంద్రబాబును కలిసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్న వారు.. సెక్రటేరియట్ వస్తే పూలబోకేలతో ఎదురెళ్లి చంద్రబాబు దృష్టిలో పడేందుకు ఎక్కువ హడావుడి చేస్తున్న వారిలో జగన్ సర్వీస్ బ్యాచ్ అధికారులే ఎక్కువగా కనిపిస్తున్నారు. బోకేలు పట్టుకుని తమకు చంద్రబాబు అంటే ఎంతో గౌరవం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వారి తీరు చూసి ఇతర అధికారులు ఆశ్చర్యపోతున్నారు. జగన్ అధికారంలో ఉన్నంత కాలం ఆయన చుట్టూ తిరిగి ఆయన కోరిక మేరకు చంద్రబాబును, ఆయన కుటుంబసభ్యుల్ని, టీడీపీ నేతల్ని నానా హింసలు పెట్టి అనేక మంది చనిపోవడానికి కారణం అయిన వారు కూడా తాము ఏమీ చేయలేదన్నట్లుగా చంద్రబాబు దగ్గరకు వెళ్లిపోతున్నారు.
పెద్దిరెడ్డి ఇంట్లో పని మనిషిలా పని చేసి… చంద్రబాబుపై రాళ్ల దాడితో హత్యాయత్నం చేయించేలా కుట్ర పన్నిన రిషాంత్ రెడ్డి, అసలు పేపర్ లీక్ కాకుండానే … లీకయిందని నారాయణస్కూల్ సిబ్బందితో స్టేట్ మెంట్ రాయించుకుని ఫోన్ ట్యాప్ చేసి మరీ నారాయణను హైదరాబాద్ నుంచి కిడ్నాప్ చేసుకెళ్లిన రిషాంత్ రెడ్డి కూడా నవ్వుతూ బోకె తీసుకు వెళ్లిపోయారు. చంద్రబాబు కక్ష సాధింపులకు వ్యతిరేకమని.. అన్నీ మర్చిపోయి తమను ఆదరిస్తారని ఆ అధికారులు అనుకుంటున్నారు. కానీ ఈ సారి మాత్రం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు.,
తప్పుడు కేసులు పెట్టి… తప్పుడు సాక్ష్యాధారాలు సృష్టించి… ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి మరీ చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరి సహా అందరిపై కేసులు పెడతామని బెదిరించిన బ్యాచ్ ను … ఎవరు మర్చిపోగలరు ?. వారంతా ఇప్పుడు వణికిపోతున్నారు. అందుకే ఏదో విధంగా బయటపడాలని అనుకుంటున్నారు. చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు పోటీ పడుతున్నారు.