మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో భారీగా రూపొందుతున్న ఈ సినిమా టీజర్ విడుదలైంది. నిమిషన్నర నిడివి గల టీజర్ లో యాక్షన్ ఘట్టాలకు పెద్దపీట వేశారు. వందమంది కలసి చంపలేని ఓ వ్యక్తిని ఒక్కడిగా చంపిన తిన్నడు క్యారెక్టర్ లో విష్ణు పరిచయమయ్యాడు. తర్వాత వచ్చిన యుద్ధ ఘట్టాలు భారీగా చిత్రీకరించినట్లుగా కనిపిస్తోంది.
టీజర్ లో విజువల్స్, మ్యూజిక్, టేకింగ్, ఇవన్నీ ఉన్నతంగానే వున్నాయి. ఈ సినిమాని న్యూజిలాండ్ లో ఎక్కవగా షూట్ చేశారు. ఆ రిచ్ నెస్ విజువల్స్ లో కనిపించింది. అడవి నేపధ్యంలో యాక్షన్ సీన్ వుంది. విష్ణు లుక్ మేకోవర్ కొత్తగా వున్నాయి. ఇలాంటి పాత్రలో ఆయన కనిపించడం ఇదే తొలిసారి. మోహన్ బాబు కనిపించారు కానీ డైలాగ్ లేదు.
ఇక ఈ టీజర్ విషయంలో అందరి ద్రుష్టి ప్రభాస్ పైనే వుంది. ఇందులో ప్రభాస్ ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. టీజర్ లో ప్రభాస్ ని పూర్తిగా చూపించలేదు. శివనామ స్మరణతో మొదలైన టీజర్ అదే నామస్మరణతో ముగించడం, ప్రభాస్ క్యారెక్టర్ పూర్తిగా రివిల్ చేయకపోవడం ఇంకా ఆసక్తిని కొనసాగించినట్లయింది.