వైసీపీకి పొలిటికల్ స్ట్రాటజిక్ సేవలు అందించిన వైసీపీకి చెల్లించిన ప్రతి రూపాయి ప్రజాధనం నుంచేనన్న అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఓ ప్రత్యేకమైన టీం లెక్కలు బయటకు తీస్తున్నట్లుగా తెలుస్తోంది. ఐ ప్యాక్ డైరక్టర్లతో బినామీ కంపెనీలు పెట్టించి వాటికి కొన్ని పాంప్లెట్లు.. ఇతర సామాగ్రి కాంట్రాక్టులు ఇచ్చారు. అలాగే ఐ ప్యాక్ లో పని చేసే వారికి వివిధ ప్రభుత్వ విభాగాల కింద అపాయింట్ మెంట్ లెటర్లు ఇచ్చి జీతాలు చెల్లించారు.
ఈ లెక్కలన్నీ బయటకు తీయబోతున్నారు. ఐ ప్యాక్ నుంచి కొన్ని వందల మందిని రిక్రూట్ చేస్తున్నారు. మండల స్థాయి నుంచి ఐ ప్యాక్ ప్రతినిధులు రాష్ట్రం మొత్తం మోహరించారు. ప్రతి ఎమ్మెల్యేలనూ నీడలా ఓ టీమ్ వెంటాడుతూ ఉంటుంది. మరికొన్ని టీములు తిరుగుతూ ఉంటాయి. వీరందరి ఖర్చు జగన్ రెడ్డి, వైసీపీ పెట్టుకుంటారని ప్రజలు అనుకుంటూ ఉంటారు. కానీ అసలు విషయం ఆ ఖర్చు ప్రజలపైనే రుద్దుతున్నారు. వేర్వేరు పేర్లుతో నిధులు చెల్లించేస్తున్నారు. కానీ వారు పని చేసేది మాత్రం ఐ ప్యాక్‌కు.
అలానే వైసీపీ చేపట్టిన పలు క్యాంపెన్లు గడప గడపకూ ప్రభుత్వం దగ్గర నుంచి ఆడుదాం ఆంధ్రా వరకూ అన్నీ వైసీపీ కనుసన్నల్లో జరిగాయి. వీటికి కావాల్సిన మెటీరియల్ అంతా ఐ ప్యాక్ డైరక్టర్ల బినామీల నుంచి వచ్చాయి. భారీగా ఎత్తున అధిక ధరలకు కొనుగోలు చేశారు. అంటే జగన్ రెడ్డి వ్యక్తిగత ఖర్చులకే కాదు… తన పార్టీ కోసం అయ్యే ప్రతి రూపాయిని కూడా ప్రజల డబ్బుతోనే ఖర్చు పెట్టుకున్నారు. అందు కోసం ఎన్ని రకాలుగా అధికార దుర్వినియోగం చేయాలో అన్ని రకాలుగా చేశారు. ఇప్పుడు ఆ వివరాలన్నీ బయటకు వచ్చే సమయం దగ్గర పడింది.