సెట్టింగ్లు వేయించుకోవడంలో జగన్ ఎక్స్ పర్ట్ అని మరోసారి బయటపడింది. ఎంపీలతో జగన్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫోటోలు, వీడియోలు బయటకు విడుదల చేశారు. ఆ వీడియోలు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అధికార సమీక్షలు నిర్వహించే సెక్రటేరియట్లో ఎలా ఎంపీలతో భేటీ అయ్యారని చర్చించుకోవడం ప్రారంభించారు.కానీ కాసేపటికే వాళ్లకు అసలు విషయం తెలిసిపోయింది.
సెక్రటేరియట్ లో ఉన్నట్లుగా మభ్యపెట్టేలా.. అక్కడ్నుంచే పని చేస్తున్నట్లుగా ప్రజలు భ్రమించేలా ఓ కాన్ఫరెన్స్ హాల్ ను జగన్ తన కోసం సెట్ చేయించుకున్నారు. తాడేపల్లిలో తనకు ఉన్న రెండు ఎకరాల ప్యాలెస్లో క్యాంప్ ఆఫీసు అంటూ.. ప్రజాధనంతో భవనం నిర్మించుకున్నారు. అందులోనే ఈ సెట్టింగ్ వేసుకున్నారు. అక్కడ ఉన్న ప్రతీ ప్రాపర్టీ ప్రజాధనంతో వేయించుకున్నదే. అయినా ఏ మాత్రం సిగ్గుపడకుండా పార్టీ కార్యక్రమాలకు వాడుకుంటున్నారు.
జగన్ రెడ్డి గతంలో తిరుమల సెట్టింగ్ ను తన ఇంటి పక్కన వేయించుకున్నారు., ఉత్సవాలొస్తే చెవిరెడ్డి నేతృత్వంలో అక్కడ సెట్టింగులు కార్యక్రమాలు జరిగేవి. చివరికి సెక్రటేరియట్ సెట్టింగ్ కూడా ఇంట్లో వేయించుకున్నారని ఇప్పుడు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఐదేళ్ల పాటు ఇంట్లో నుంచి బయటకు రాకుండా..కళ్లు మూసుకుంటే ఐపోయాయని కబుర్లు చెబుతున్నారని సెటైర్లు వేస్తున్నారు.