ఏపీలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులు, జగన్ కు వంత పాడిన అధికారులకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు స్పీడ్ పెంచారు. సీనియర్ అధికారులుగా ఉండి కూడా జగన్ కు వంత పాడిన వారిని పాలన నుండి తప్పించే అవకాశాలున్నాయి.
ఇప్పటికే తిరుమల ఈవో బాధ్యతల నుండి ధర్మారెడ్డిని తొలగించిన చంద్రబాబు ప్రక్షాళనకు నాంది పలికారు. సీఎస్ గా పనిచేసిన జవహర్ రెడ్డిని సెలవుపై పంపించగా… సీనియర్ అధికారులు ప్రవీణ్ ప్రకాష్ సహా చాలా మంది అధికారులను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించే అవకాశాలున్నాయి.
ఇదే అంశంపై సీఎం చంద్రబాబు సీఎస్ నీరబ్ కుమార్, డీజీపీతో సమావేశం అయ్యారు. పరిపాలన పరంగా నిర్ణయాలు, కొందరు అధికారులను తప్పించటంతో పాటు కొందరు అధికారులపై కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
గతంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారుల జాబితా ఇప్పటికే రూపొందించగా… ఆ లిస్టుపై చంద్రబాబు త్వరలో నిర్ణయం తీసుకోవటంతో పాటు, ఐఏఎస్-ఐపీఎస్ ల బదిలీ సహా కిందిస్థాయి ఉద్యోగుల వరకు స్థానచలనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.