టీ20 ప్రపంచకప్ నుంచి పాకిస్తాన్ అవుట్ అయ్యింది. క్రికెట్ పసికూన అమెరికా సూపర్-8కు దూసుకెళ్లింది. గ్రూప్ దశలో పాక్ రెండు మ్యాచులు ఓడిపోవడంతో సూపర్-8 అవకాశాలు మసకబారాయి. గ్రూప్-ఏలో భాగంగా అమెరికా, ఐర్లాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ పై బోలెడు ఆశలు పెట్టుకుంది పాక్. అయితే ఒక్క బంతి కూడా పడకుండానే వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దు అయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. మొత్తం నాలుగు మ్యాచ్ల్లో ఐదు పాయింట్లు సాధించిన అమెరికా తొలిసారి సూపర్-8 దశకు అర్హత సాధించింది.
గ్రూప్ దశలో పటిష్ట జట్టుగా కనిపించిన పాక్ ఇలా ఇంటిముఖం పట్టడాన్ని ఆ దేశ మాజీ క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆటగాళ్ళపై ఘాటైన వాఖ్యలు చేస్తున్నారు. ఇదే జట్టు కొనసాగితే పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో కలిసిపోతుందని ఆగ్రహిస్తున్నారు. జట్టులో ఒక్క ఆటగాడు రాణించలేదని, అంతర్జాతీయ క్రికెట్ అదే అర్హత జట్టులో చాలా మంది ఆటగాళ్ళకి లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో జట్టు విదేశీ కోచ్ ల సారధ్యంలో కొనసాగడంపై కొందరు మండిపడుతున్నారు. పాక్ బోర్డ్ తప్పుడు నిర్ణయాల వలనే జట్టుకి ఈ గతి పట్టిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. హఫీజ్ లాంటి అటగాడైతే పాక్ జట్టు ఓ బలిపశువని తన ఆగ్రహం, అసహనాన్ని వెళ్ళగక్కాడు.