చంద్రబాబు నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రావడాన్ని వైసీపీ నేతలు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వంపై విమర్శల దాడి చేయడమే ఎజెండాగా పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ కు ఒక్కరికే డిప్యూటీ సీఎం పదవిని కేటాయించడం సామాజిక న్యాయానికి తూట్లు పొడవడం లాంటిదేనని వైసీపీ నేత పోతిన మహేష్ వక్రభాష్యం చెప్పారు.
వైసీపీ హాయాంలో జగన్ సామాజిక న్యాయం పాటిస్తూ…10 మందికి ఉపముఖ్యమంత్రి పదవులు ఇచ్చారన్న పోతిన మహేష్, కూటమి సర్కార్ లో పవన్ కళ్యాణ్ కు మాత్రమే చంద్రబాబు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడమంటే మిగతా వర్గాలను అవమానించడమేనన్నారు. జగన్ పదిమందిని ఉప ముఖ్యమంత్రులుగా చేసినా ఒక్కరికి సొంత నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి.కొంతమంది తమ శాఖలపై సమీక్షలు నిర్వహించాలన్న జగన్ రెడ్డి లేదంటే సజ్జల అనుమతి తీసుకొని రివ్యూ నిర్వహించాల్సిన దుస్థితి ఉండేది. విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవాలంటే జగన్ అనుమతి తప్పనిసరి. వైసీపీ హయాంలో ఉప ముఖ్యమంత్రి పదవులన్నీ అలంకారప్రాయంగా మాత్రమే ఉండేది.
సామాజిక న్యాయాన్ని ప్రతిబింబించేలా కేబినెట్ ను ఏర్పాటు చేసిన చంద్రబాబు, పవన్ ఒక్కరికే డిప్యూటీ సీఎం అవకాశం ఇచ్చినా మంత్రులందరికీ తమ శాఖలపై నిర్ణయాలు తీసుకునే స్వేఛ్చ ఇచ్చారు. గతంలో ఉప ముఖ్యమంత్రులకు ఈ స్వేఛ్చ ఉండేది కాదనేది ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు పదిమందికి చంద్రబాబు ఉపముఖ్యమంత్రి పదవులు ఇవ్వలేదన్న మాటే కానీ, మంత్రులకు కేటాయించిన శాఖలో స్వేచ్చగా నిర్ణయాలు తీసుకొని పవర్ ఇచ్చారు. మంత్రులంతా ఒక్కొక్కరుగా తమ శాఖలపై రివ్యూలు నిర్వహిస్తూ బిజీ అవుతున్నారు. వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా సామాజిక న్యాయం అంటే కేవలం పదవులు ఇచ్చి పవర్ లాగేసుకోవడమేనని పోతిన మహేష్ చెప్తున్నట్టుగా ఉంది.