సీఎం అంటే అందరికీ ఆదర్శంగా ఉండాలి. కానీ జగన్ రెడ్డి మాత్రం తప్పుడు పనులు చేసే వారికి రోల్ మోడల్ గా మారారు. ఏపీలో సీఎంగా ఉంటూ హైదరాబాద్ లో తన ఇంటి ముందు ఫుట్ పాత్ ను ఆక్రమించేశారు. సీఎంగా ఉన్నంత కాలం దాని జోలికి ఎవరూ రాకుండా చూసుకున్నారు. కానీ పదవి పోయాక.. బుల్డోజర్లు వచ్చి కూల్చేసిపోయాయి.
హైదరాబాద్ లోటస్ పాండ్లో జగన్ కు ఇల్లు ఉంది. అది నాది కాదని ఆయన చెబుతారు. ఎందుకంటే అది సూట్ కేసు కంపెనీల పేరు మీద ఉంటుంది.కానీ అది ఆయనదేనని అందరికీ తెలుసు. జగన్ సీఎం అయ్యాక అక్కడ ఉండటం లేదు. కానీ ఇంటికి కాపలాగా ఏపీ పోలీసుల్ని పెట్టుకున్నారు. మరి అక్కడ సెక్యూరిటీ పోస్టులు ఉండాలిగా అందుకని ఇంట్లో కాకండా.. ఫుట్ పాత్ మీద రూములు కట్టించేశాడు. ఇది లోటస్ పాండ్ కాలనీ వాసులకు ఆగ్రహం తెప్పించింది. గ్రేటర్ అధికారులకు చాలా సార్లు ఫిర్యాదు చేశారు. కానీ పొరుగు రాష్ట్ర సీఎం అని వివాదం అవతుందని ఊరుకున్నారేమో ాకనీ ఆయన పదవి పోయిన వారానికే నోటీసులు ఇచ్చారు.
శుక్రవారం వెళ్లి.. ఆ ఫుట్ పాత్ పై ఉన్న సెక్యూరిటీ పోస్టులు తీసేయకపోతే కూల్చేస్తామని ఇంట్లో ఉన్న సిబ్బందికి చెప్పి వచ్చారు. శనివారం ఉదయం వచ్చి కూలగొట్టేశారు. అయినా విశాలంగా ఉండే లోటస్ పాండ్ లోప సెక్యూరిటీ పోస్టులు కట్టించుకోవచ్చు కదా.. పుఠ్ పాత్ ఆక్రమించడం ఏమిటని.. జగన్ పై ఎవరైనా అసహ్యంగా చూస్తే.. ఆయన పట్టించుకోరు. ఎదుకంటే.. అదంతే !