తమిళ సినిమాలు తెలుగులో తెగ అడేస్తాయి. విక్రమ్, జైలర్ విజయాల్లో తెలుగు ప్రేక్షకుల వాటానే ఎక్కువ. అయితే కొన్నాళ్ళుగా తమిళ సినిమాల సందడి తగ్గింది. ఇలా రావడం అలా వెళ్ళిపోవడమే కానీ ఒక్కటంటే ఒక్కటీ ఇక్కడ నిలబడలేకపోయింది. ధనుష్, కార్తి, విశాల్, సిద్దార్థ్ ఇలా ఎంతోమంది హీరోలు కొత్త సినిమాలతో తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చారు కానీ హిట్ అందుకోలేకపోయారు.
అయితే ఎట్టకేలకు తమిళ సినిమా తెలుగులో ఊపిరి పీల్చుకుంది. విజయ్ సేతుపతి మహారాజకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. కథ, కథనాలు, విజయ్ నటన.. వావ్ అనిపించాయి. మంచి రివ్యూలు వచ్చాయి. పబ్లిక్ టాక్ బావుంది. వర్డ్ అఫ్ మౌత్ బాగా స్ప్రెడ్ అయ్యింది. వెరసి.. ప్రస్తుతం సినిమా హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. బుక్ మై షో ఓపెన్ చేస్తే టికెట్లన్ని సోల్డ్ అయిన సినిమాగా మహారాజ ఒక్కటే కనిపిస్తోంది. ఈ రెండు రోజులు వరుసగా సెలవులు రావడం మహరాజ కి కలిసొచ్చే మరో అంశం. మొత్తానికి మహారాజ రూపంలో డబ్బింగ్ సినిమాకి కొత్త ఊపిరొచ్చింది.